#JusticeforPunjabiGirl: అగ్గి రాజేసిన పోసాని: సంకటంలో పవన్ కల్యాణ్: జనసేన కౌంటర్ అటాక్
అమరావతి: మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. అనేక మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-జనసేన మధ్య నిన్నటిదాకా మాటల యుద్ధం నడిచింది. ప్రెస్ మీట్స్ పెట్టి మరీ పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తారు ఒకరిద్దరు మంత్రులు. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్‌లో తమపై చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ రేంజ్‌లోనే చెలరేగి ఘాటుగా బదులు ఇచ్చారు.
ఆ వివాదం కంటిన్యూ..
అక్కడితో ఈ వివాదం సద్దు మణిగిందనుకుంటే పొరపాటే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా గుర్తింపు ఉన్న నటుడు పోసాని కృష్ణమురళి దాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలనివ్వడనే పేరుంది ఆయనకు. అలాంటిది- వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తీవ్ర విమర్శలు చేయడాన్ని.. అదే సినిమా ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దాడికి దిగారు.
మెగాస్టార్ ప్రస్తావన కూడా..
వైఎస్ జగన్ వ్యక్తిత్వానికి పవన్ కల్యాణ్ ఏ మాత్రం సరితూగడని, ఆయనను విమర్శించే స్థాయి లేదని అన్నారు. సినిమా ఫంక్షన్‌లో రాజకీయాల గురించి మాట్లాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులను తిట్టడానికి అదేమైనా పొలిటికల్ డయాస్ కాదని, జనసేన పార్టీ కార్యాలయం అంతకంటే కాదని అన్నారు. పవన్ మాట్లాడిన బాష బాగో లేదని, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి ఏనాడైనా అమర్యాద పదాలు రాలేదని పోసాని చెప్పారు.
పంజాబీ అమ్మాయికి కడుపు చేశారు..
చిరంజీవితో రాజకీయంగా అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ.. చిరంజీవి ఎప్పుడు గానీ వైఎస్ జగన్, మంత్రులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి గురించి ప్రస్తావించారు. పంజాబీ అమ్మాయికి మంచి అవకాశాలు ఇస్తానని పవన్ కల్యాణ్ ఆశ పెట్టి, కడుపు చేశాడని ధ్వజమెత్తారు. ఎన్నో ఆశలు, కలలతో ఆ అమ్మాయి తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తే- చూడ్డానికి అందంగా ఉందనే కారణంతో ఆమెను పవన్ కల్యాణ్ వాడుకుని వదిలేశాడని ధ్వజమెత్తారు.
ట్రెండింగ్‌లో
ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఆ అమ్మాయికి న్యాయం చేస్తే- తాను గుడి కడతానని చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణమురళి ప్రస్తావించిన ఈ పంజాబ్ అమ్మాయి.. తెల్లవారే సరికి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు #JusticeforPunjabiGirl అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. పోసాని కృష్ణమురళి విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన ఆ పంజాబీ నటికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోన్నారు. వేల కొద్దీ ట్వీట్లు, రీట్వీట్లు పడుతున్నాయి.
Recommended Video
పవన్ కల్యాణ్ కౌంటర్..
పోసాని కృష్ణమురళి తాజాగా లేవనెత్తిన అంశం.. పవన్ కల్యాణ్‌ను సంకట స్థితిలోకి నెట్టినట్టే అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ పంజాబీ నటికి పవన్ కల్యాణ్ అన్యాయం చేశాడనే విషయం ఆఫ్ ది రికార్డ్‌గా ఉంటూ వచ్చిందని, దాన్ని పోసాని కృష్ణమురళి బహిరంగంగా ఓ విలేకరుల సమావేశంలో ప్రస్తావించడంతో అగ్గిరాజేసినట్టయిందని అంటున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ రెస్పాండ్ అయ్యారు. గ్రామ సింహాలతో పోల్చారు. జనసేన కూడా ఎదురుదాడికి దిగింది. పోసాని కృష్ణమురళిని లక్ష్యంగా చేసుకుని కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది.












Click it and Unblock the Notifications