వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హెచ్ఆర్సీగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి: ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితలతో కూడిన కమిటీ సిఫారసు చేసింది. ఏపీ హెచ్ఆర్సీ ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యుల పేర్లను ఖరారు చేసింది. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం జ్యుడీషియరీ సభ్యునిగా, సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ గోచిపాటా శ్రీనివాస రావు నాన్ జ్యుడీషియరీ సభ్యునిగా నియమితులయ్యారు.

నాడు వైఎస్ జగన్ కేసులో లక్ష్మీనారాయణ..నేడు చంద్రబాబు కేసులో అదే లక్ష్మీనారాయణనాడు వైఎస్ జగన్ కేసులో లక్ష్మీనారాయణ..నేడు చంద్రబాబు కేసులో అదే లక్ష్మీనారాయణ

ఉత్తర్వులు జారీ..

ఉత్తర్వులు జారీ..

హెచ్ఆర్సీ ఛైర్మన్‌ను ఎంపిక చేయడానికి ఈ కమిటీ సచివాలయంలో సమావేశమైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత కూడా ఈ కమిటీలో సభ్యుడే. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి ఈ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. కొన్ని పేర్లను పరిశీలించిన అనంతరం మంధాత సీతారామ మూర్తి పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దీనిపై షరీఫ్, తమ్మినేని సీతారాం, వైఎస్ జగన్, సుచరిత సంతకాలు చేశారు.

న్యాయవ్యవస్థలో అపార అనుభవం..

న్యాయవ్యవస్థలో అపార అనుభవం..


జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి స్వస్థలం కాకినాడ. 12 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేశారు. 1996లో జిల్లా జూనియర్ గ్రేడ్-2 జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎస్పీఈ, ఏసీబీ కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాల్లో జడ్జిగా పనిచేశారు. నెల్లూరులో జిల్లా రెండో అదనపు న్యాయస్థానం, కర్నూలులో మూడో అదనపు జిల్లా న్యాయస్థానాలు, ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేశారు. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జిగా, విశాఖపట్నం మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా సేవలందించారు. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

గోల్డ్ మెడలిస్ట్..

గోల్డ్ మెడలిస్ట్..


2013 అక్టోబర్ 23వ తేదీన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం పదవీ విరమణ చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1996-96 మధ్యకాలంలో జిల్లా న్యాయమూర్తిగా శిక్షణ పొందే సమయంలోనూ బంగారు పతకాన్ని సాధించారు.

English summary
Commitee recommends Justice Mandhata Seetharama Murti is the chairperson of AP Human Rights Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X