చంద్రబాబుకు జస్టిస్ ఎన్వీ రమణ కీలక ప్రతిపాదన - ఆమోదిస్తే..!!
సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక ప్రతిపాదన చేసారు. తెలుగు భాష కనుమ రుగు అయ్యే పరిస్థితి ఉందని అప్రమత్తం చేసారు. అదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయి నట్లేనని హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధి కోసం తెలుగును పూర్తిగా వదిలిపెట్టి ఇంగ్లీష్ కు అల వాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఎన్వీ రమణ కీలక ప్రతిపాదన చేసారు.
తెలుగు రాష్ట్రాల విభజనతో తెలుగు అతి త్వరగా మరుగునపడే పరిస్థితి కనిపిస్తోందని మాజీ సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మాతృభాషలో ఉన్న అంశాలను నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చు కునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తాను ఏడో తరగతికి వచ్చేంత వరకు ఇంగ్లీష్ నేర్చు కోలేదని చెప్పారు. కానీ, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ఆయన గుర్తుచేశారు.

అదే విధంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వ్యక్తులు మాతృభాషలోనే చదివారని వివరించారు. పాఠశాలలో ఇంగ్లీష్ మాత్రమే బోధించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 585ను రద్దు చేయాలని తాను ప్రభుత్వానికి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు.
ఈ అంశం పైన సుప్రీంకోర్టులో ఉన్న ఎస్ఎల్పీని ఉపసంహరించుకోవాలని తాను ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా లోకేష్ ను కోరారని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు అకాడమీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు మన సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారని, ఇక్కడ కనీసం మనం ఇంట్లోనైనా పిల్లలతో తెలుగు మాట్లాడాలని పేర్కొన్నారు. తెలుగు భాషపై ఒక పరిశోధన కేందం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ఎన్వీ రమణ సూచించారు.












Click it and Unblock the Notifications