సుప్రీంకోర్టు జడ్డీలకు కొత్త రోస్టర్ విడుదల- జస్టిస్ రమణకు ఏ కేసులిచ్చారో తెలుసా ?
సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని కోర్టుల్లోనూ దాఖలయ్యే పిటిషన్ల విచారణను ఏయే బెంచ్‌లు చేపట్టాలో ఆయా కోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు నిర్ణయిస్తుంటారు. సదరు న్యాయమూర్తుల అనుభవం, ఆయా కేసుల్లో విచారణ జరిపే సామర్ధ్యం, వారి పనితీరు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈ రోస్టర్లు తయారవుతాయి. వీటి ఆధారంగానే ఆయా పిటిషన్లు దాఖలైనప్పుడు వాటిని ఆయా బెంచ్‌లకు కేటాయిస్తుంటారు.
తాజాగా సుప్రీంకోర్టులోనూ కేసుల విచారణ కేటాయంపుకు సంబంధించినరోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, కాబోయే ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు పలువురు న్యాయమూర్తులకు ఏయే కేసులు వాదించాలో కేటాయింపులు జరిగాయి.
వీటిలో ఏపీకి చెందిన న్యాయమూర్తి, కాబోయే ఛీఫ్ జస్టిస్‌గా ప్రచారంలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే విషయంలో నిన్న మొన్నటి వరకూ ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ, తదనంతర పరిణామాల్లో రమణకు దక్కబోయే కేసులు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి తెరదించుతూ ఆయనకు కీలకమైన రెండు అంశాలపై దాఖలయ్యే పిటిషన్ల విచారణను అప్పగించారు.

సుప్రీంకోర్టు తాజా రోస్టర్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ఎన్నికలతో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్లు విచారించనుంది. ఆ తర్వాత కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రజాప్రయోజన వాజ్యాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన పిటిషన్లను విచారిస్తారు. ఇవే పిటిషన్లను ఛీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనాలు కూడా విచారణ జరుపుతాయి.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications