రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు కొత్త హంగులు: భూమిపూజ చేసిన కేంద్రమంత్రి
రాజమండ్రి: రాజమండ్రి విమానాశ్రయానికి కొత్త హంగులు సమకూరనున్నాయి. క్రమంగా అంతర్జాతీయ హోదాను సంతరించుకోనుంది ఈ ఎయిర్‌పోర్ట్. భవిష్యత్తులో రాత్రివేళ కూడా విమానాల ల్యాండింగ్ అయ్యేలా, టేకాఫ్ తీసుకునేలా దీన్ని విస్తరించడానికి చర్యలను తీసుకుంది కేంద్రప్రభుత్వం.
ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి వారానికి 126 ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తోన్నాయి. రాజమండ్రి- హైదరాబాద్, రాజమండ్రి- చెన్నై, రాజమండ్రి- బెంగళూరును అనుసంధానిస్తోన్నాయి. ఇప్పుడున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.

దీని విస్తరణకు పూనుకుంది. 350 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరణ పనులను చేపట్టింది. ఈ పనులకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొద్దిసేపటి కిందటే రాజమండ్రి విమానాశ్రయంలో భూమిపూజ చేశారు. కొత్త టెర్మినల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
#WATCH | Andhra Pradesh: Union Civil Aviation Minister Jyotiraditya Scindia performs bhoomi poojan of the new terminal building at the Rajahmundry Airport. pic.twitter.com/PYD0JTQgbE
— ANI (@ANI) December 10, 2023
కొత్తగా 17,029 చదరపు మీటర్ల మేర విస్తరణకు నోచుకుంది ఈ ఎయిర్‌పోర్ట్. ఇందులో 21,094 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనం రూపుదిద్దుకోనుంది. ప్రతి గంటకూ 2,100 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా ఈ భవనం నిర్మితమౌతుంది. సంవత్సరానికి 30 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకుంటారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
#WATCH | Andhra Pradesh: Union Civil Aviation Minister Jyotiraditya Scindia inspects the new terminal building at the Rajahmundry Airport before the foundation stone laying event. pic.twitter.com/EQP62Jsj7W
— ANI (@ANI) December 10, 2023
కొత్త టెర్మినల్ భవనంలో 28 చెక్-ఇన్ కౌంటర్లు, అరైవల్ పాయింట్‌లో నాలుగు కన్వేయర్ బెల్ట్స్, ఎనిమిది ఎక్స్- బిస్ మెషీన్లు, మూడు ఏరో బ్రిడ్జిలు రానున్నాయి. ఒకేసారి 600 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్ ప్రదేశాన్ని అప్ గ్రేడ్ చేయనున్నట్లు పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ వివరించింది.












Click it and Unblock the Notifications