అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. 2011 మార్చి 6వ తేదీన స్నేహ రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ముందుగా ప్రేమించుకొని పెళ్లికి పెద్దవారిని ఒప్పించారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి తమ స్నేహితుల పెళ్లి సమయంలో కలిశారు. పరిచయమైనప్పుడు ఇద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. ఆ తర్వాత ఒకరి ప్రేమలో మరొకరు పడ్డారు.
తర్వాత కుటుంబ సభ్యులకు తమ ప్రేమ గురించి చెప్పారు. అల్లు అర్జున ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. కానీ స్నేహారెడ్డి కుటుంబంలో మాత్రం కొంచెం కష్టంమీద ఓకే చెప్పారు. సినీ పరిశ్రమలో ఉండే హీరోలు ఎక్కువగా కథానాయికలతో కలిసి వుంటారని, సినిమావాళ్లు కుటుంబాన్ని అసలు పట్టించుకోరని ముందుగా వద్దని చెప్పారు. అయితే సినీ పరిశ్రమకు బయట ఉండే వ్యక్తులే అలా ఉంటారని వాదించడంతో ఒప్పుకున్నారు. పెళ్లి సమయంలో అల్లు అర్జున్ కట్నం కింద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్నేహారెడ్డి తండ్రి, బన్నీ మామ కె.చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

ఒక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు బన్నీ గురించి గొప్పగా చెప్పారు. పెళ్లి సమయంలో తనదగ్గర నుంచి కట్నంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, అతనికి చాలా ఆస్తులున్నాయన్నారు. అతని ఆస్తులతో పోలిస్తే తానిచ్చే కట్నం ఏమాత్రం సరితూగదని, అతను మంచి నటుడేకాదని, మంచి వ్యక్తి అని కొనియాడారు. అల్లుడిగా అతనికి వందకు వంద మార్కుల ఇస్తానన్నారు. ఒకప్పుడు తెలుగులో హీరో మాత్రమేనని, కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన అల్లుడికి అభిమానులు ఉండటంపట్ల తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ఈ విషయంలో తాను ఎంతో సంతోషిస్తానన్నారు.












Click it and Unblock the Notifications