కెకెకు సతీవియోగం: పరామర్శలు (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జాతీయ కార్యదర్శి కె.కేశవరావు భార్య వసంత కుమారి సోమవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధమైన సమస్యతో బాధపడుతున్నారు వసంతకుమారి మృతికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో సానుభూతి తెలిపారు. కేశవరావు కుటుంబానికి సంతాపం తెలిపారు.
తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌తో పాటు శాసనసభ్యులు కెటి రామారావు, హరీశ్వర్‌రావు, కొప్పుల ఈశ్వర్, పార్టీ నాయకులు కేశవరావు నివాసానికి వెళ్లి వసంతకుమారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళుల అర్పించారు.
తెలంగాణకు చెందిన రాష్ట్ర సమితి కె. జానా రెడ్డి, పలువురు తెలంగాణ నాయకులు కేశవరావు నివాసానికి వెళ్లి సంతాపం ప్రకటించారు. కేశవరావును పరామర్శించారు.

కెసిఆర్ పరామర్శ..
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, శానససభ్యులు కేశవరావు నివాసానికి వెళ్లి ఆయన భార్యకు నివాళులు అర్పించారు.

జానా రెడ్డి పరామర్శ..
తెరాస నాయకుడు కె. కేశవరావును తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి, తదితరులు పరామర్శించారు.

షబ్బీర్ అలీ పరామర్శ..
తెరాస నాయకుడు కె. కేశవరావును మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి పరామర్శించారు.

ఎర్రబెల్లి నివాళులు..
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కెకె సతీమణి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications