పహల్గాం దాడి అమెరికాకు ముందే తెలుసు.. అయినా ఆపలేదు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాకిస్థాన్- భారత్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసిగా భారత్ ఉంది. ఈ క్రమంలో భారత్.. ఎప్పుడు, ఎక్కడ.. ఏ సమయంలో దాడి చేస్తుందోనని పాకిస్థాన్ భయంతో ఉంది.
ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి మొత్తం సమాచారం అమెరికాకు ముందే తెలుసని అన్నారు. అమెరికా నిఘా వర్గాల వద్ద ఈ దాడికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఉందని తెలిపారు. అయినా ఎందుకు ముందే చెప్పలేదని అమెరికాపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో గతంలో తాను ప్రధాని మోదీ, వైట్‌హౌస్ అనుమతితో పాకిస్థాన్ వెళ్లి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదుర్చుతానని పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పహల్గాం ఘటనపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7.. లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరిగింది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అలాగే పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కు ప్రతిపాదనలు పంపింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications