ఆప్ఘన్ సంక్షోభంపై కేఏ పాల్ షాకింగ్ -గుండె తరుక్కుపోతోంది-ఫ్రెండ్ బైడెనే కారణం
ఏపీతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేపే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఆప్ఘనిస్తాన్ సంక్షోంభంపై తనదేైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ టీపీ ఛానల్ చర్చలో పాల్గొన్న కేఏ పాల్ ఆప్ఘన్ సంక్షోభానికి గల కారణాన్ని వెల్లడించారు. అక్కడి పరిస్ధితులు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు.
ఆప్ఘనిస్తాన్ లో ప్రస్తుత పరిస్ధితులపై ఆందోళన వ్యక్తం చేసిన కేఏ పాల్ ... దీనికి అమెరికానే ప్రధాన కారణమన్నారు. ఆప్ఘన్ పరిస్ధితులు చూస్తుంటే గుండె బరువెక్కుతోందన్నారు. ఆప్ఘనిస్తాన్ లో వైఫల్యంతో అమెరికా బలగాలు వెనుదిరగడమేంటని కేఏ పాల్ ప్రశ్నించారు. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లడంపై పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యుద్ధం వద్ధని తాను అమెరికాకు ముందే చెప్పానని కూడా ఆయన గుర్తుచేశారు.

ఆప్ఘనిస్తాన్ లో శాంతికి సంబంధించి ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ అన్నారు. ఆప్ఘాన్ ప్రస్తుత పరిస్ధితులకు తన స్నేహితుడు జో బైడెనే కారణమని పాల్ ఆరోపించారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ కు ఈ పరిస్దితి దాపురించిందని పాల్ తెలిపారు. ఆప్ఘన్ లో తాజా పరిస్ధితుల నేపథ్యంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందని పాల్ పేర్కొన్నారు.
గతంలో పలు యుద్ధ సంక్షోభిత దేశాల్లో శాంతి దూతగా పర్యటించి చర్చలు జరిపిన చరిత్ర ఉన్న కేఏ పాల్ .. ఇప్పుడు కూడా తనకు అవకాశం లభిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు పలు దేశాల అధినేతలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే పాల్... ఇప్పుడు ఆప్ఘన్ లో ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే తనకు చేతనైనంత సాయం చేస్తానని పాల్ చెప్తున్నారు. గతంలో ఆప్ఘనిస్తాన్, ఇరాక్ తో పాటు పాల్ పర్యటించి అక్కడ శాంతి కోసం కృషి చేశారు. అప్పట్లో అమెరికా బలగాల చేతుల్లో ఉన్న ఈ దేశాల్లో శాంతి కోసం పాల్ ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications