వైఎస్ షర్మిల, సునీతలకు మరో షాక్
పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది.
సరిగ్గా అంటే.. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డే అని..ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దని సునీత, షర్మిల రొడ్డెక్కి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించవించడానికి వీల్లేదని కడప కోర్టు స్పష్టం చేసింది.
అయితే కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల వివేక కూమార్తె సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ సునీత, షర్మిల వేసిన పిటిషన్‌ను కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications