వివేకా హత్యకేసులో కీలక పరిణామం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జులై 3వ తేదీకి కేసును వాయిదా వేస్తూ ప్రతివాదులకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీచేసింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు కేసు ఫైల్ ను లిస్ట్ చేయాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దుచేయాలంటూ వివేకా కుమార్తె సునీత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మే 31న షరతులతో నిండిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది . జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ చేసిన దర్యాప్తులో ఎంపీ జోక్యం చేసుకుంటున్నట్లుగా క్లెయిమ్ చేయలేదు. సాక్ష్యాధారాలను తారుమారు చేయడంతోపాటు సాక్షులను బెదిరించడం వంటివాటిపై విచారణ అధికారులు ఎటువంటి ఆరోపణలు చేయలేదు.

ఎఫ్‌ఐఆర్‌లో బాధితుడి శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని, అయినప్పటికీ దర్యాప్తు అధికారి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేయలేదని జస్టిస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 174ను అమలు చేశారని, ఇది దర్యాప్తు అధికారి తప్పిదమని, ఎంపీ ప్రభావమే ఇందుకు కారణమని న్యాయమూర్తి అన్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని రికవడరీ చేయడంతోపాటు నిందితులకు పంచిన రూ.4 కోట్ల గురించిన వివరాలు కస్టడీ ఎంక్వయిరీకి ఆధారాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications