'జగన్! ప్రజారాజ్యం నుంచి తీసుకున్నారుగా.. కడపలో గెలుపు, మిగిలేది మీరే'

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చివరకు ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మిగలడం ఖాయమని, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపు ఖాయమని కడప జిల్లా టిడిపి నేతలు శనివారం స్పష్టం చేశారు.

ఫిరాయింపులు మీరు నేర్పింది

ఫిరాయింపులు మీరు నేర్పింది

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు మారడం నేర్పించింది మీ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డియేనని, ఇవన్నీ తెలిసి అమాయకుడిలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జగన్ మాట్లాడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌‌లు కడపలో విమర్శించచారు.

టిడిపి, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా

టిడిపి, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా

ప్రజాస్వామ్యం గురించి పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లు మాట్లాడుతున్నాయని, వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిడిపిని భూస్థాపితం చేస్తానని చెప్ప లేదా, అలాగే టిడిపి, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్పించుకోలేదా అని వారు నిలదీశారు. అప్పుడు జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి తెలియదా? అన్నారు.

15 రోజుల్లో ఉంటే అధికారం అన్న జగన్..

15 రోజుల్లో ఉంటే అధికారం అన్న జగన్..

ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని కుటుంబం వైయస్ కుటుంబం అని వారు ధ్వజమెత్తారు. 2011లో టిడిపి, కాంగ్రెస్‌ పార్టీల నుంచి నారాయణ రెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. గవర్నర్‌ కార్యాలయంలో 15 మంది ఎమ్మెల్యేలు తనకు ఉంటే అధికారం ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు.

జగన్ ఒక్కరే మిగులుతారు.. బీటెక్ రవిదే గెలుపు

జగన్ ఒక్కరే మిగులుతారు.. బీటెక్ రవిదే గెలుపు

రానున్న రోజుల్లో మీరొక్కరే పార్టీలో ఉంటారని మిగిలిన వారంతా టిడిపిలో చేరుతారని వారు చెప్పారు. సోమవారం వచ్చే ఫలితాల్లో బీటెక్‌ రవి వంద ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kadapa district Telugudesam Party leaders very confidence on B Tech Ravi win in MLA elections.
Please Wait while comments are loading...