వైసీపీలోకి కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత...!!
ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కడప ఎంపీగా వైసీపీ నుంచి అవినాశ్.. కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తుండటం తో అక్కడి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పులివెందుల నుంచి జగన్ పైన పోటీ చేసే అభ్యర్దిని కాంగ్రెస్ ప్రకటించలేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలపైన వైసీపీ ఫోకస్ చసింది. జిల్లాకు చెందిన సీనియర్ నేత టీడీపీ వీడేందుకు సిద్దమయ్యారు.
కడప జిల్లాలోకమలాపురం సీనియర్ నేత వీరశివారెడ్డి వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. ప్రొద్దుటూరులోతాజాగా కమలాపురం వైసీపీ కో అర్డినేటర్ మల్లిఖార్జున రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీలో తనకు కమలాపురం సీటు ఇస్తారని ఆశించారు. అదే విధంగా తనకు ఇవ్వకపోయినా తన సోదరుడి కుమారుడు ప్రవీణ్ రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తారని ఆశించారు.

ప్రవీణ్ రెడ్డి ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. ఇద్దరికీ సీటు ఇవ్వకపోవటం...కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యారెడ్డికి టికెట్ ఇవ్వటం పైన వీరశివారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. కమలాపురంలో చైతన్యకు మద్దతు ఇవ్వటానికి వీరశివారెడ్డి సిద్దంగా లేనని తేల్చి చెప్పారు.
కమలాపురం లో వైసీపీ నుంచి రవీంద్రనాధ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరశివారెడ్డి టీడీపీ వీడాలని నిర్ణయం తీసకోవటంతో ఆయనతో టీడీపీ నాయకత్వం మంతనాలు ప్రారంభించింది. ఇటు వైసీపీ నేతలతో జరిగిన చర్చల ఫలితంగా వీరశివారెడ్డి వైసీపీలో తన అనుచుర వర్గంతో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ వారంలోనే జగన్ సమక్షంలో వీరశివారెడ్డి వైసీపీలో చేరుతారని చెబుతున్నారు.
అదే విధంగా.. జిల్లాలోని మరో కీలక నియోజకవర్గంలో సీటు రాని టీడీపీ సీనియర్ నేత స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం ఆయనతో వైసీపీ ముఖ్యలు టచ్ లోకి వెళ్లారు. ఆయన వైసీపీలో చేరే అంశం పై అనుచర వర్గం తో చర్చించి నిర్ణయిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో..కడప జిల్లాలో త్వరలో వైసీపీలో కీలక చేరికలు ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications