ముస్లిం జంట వెడ్డింగ్ కార్డుపై వినాయక మంత్రం, కలశం, స్వస్తిక్!

ఓ ముస్లిం జంట వివాహం సందర్భంగా గురువారం జరిగిన విందుకు ఆహ్వాన పత్రికలపై ‘శ్రీ గణేశాయ నమః’ అని ముద్రించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లా పిండారి గ్రామస్థుడు నస్రుల్లా సోదరుడు సెరాజుద్దీన్‌.

వారణాసి: ఓ ముస్లిం జంట మత సామరస్యాన్ని చాటుకుంది. రూపాలు వేరైనా దేవుడు అందరికీ మంచి చేసేవాడని తెలియజేసింది. ఆ ముస్లిం జంట వివాహం సందర్భంగా గురువారం జరిగిన విందుకు ఆహ్వాన పత్రికలపై 'శ్రీ గణేశాయ నమః' అని ముద్రించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లా పిండారి గ్రామస్థుడు నస్రుల్లా సోదరుడు సెరాజుద్దీన్‌కు రిజ్వాన్‌తో వివాహం జరిగింది. ఈ సందర్భంగా బంధుమిత్రులకు గురువారం విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలపై హిందూ దేవతలకు సంబంధించిన మంత్రాలు, చిహ్నాలు ముద్రించారు.

Kalash, Swastika adorn Muslim wedding invite in Ballia village

'శ్రీ గణేశాయ నమః', 'మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ, మంగళం పుండరీకాక్ష మంగళాయేతనో హరిః' అనే మంత్రాలను ముద్రించారు. అంతేగాకుండా ఈ పత్రికపై కలశం, స్వస్తికా గుర్తులు కూడా ముద్రించారు.

ఈ వెడ్డింగ్ కార్డులను హిందూ మిత్రుల కోసం తయారు చేయించామని నస్రుల్లా తెలిపారు. వివాహాలు, పండుగల సమయాల్లో తామంతా కలిసిమెలిసి ఉంటామని అన్నారు. ఈ వివాహ పత్రికను చూసిన పలువురు వారిని అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+