మళ్లీ జైలుకు: వైయస్ జగన్‌పై కాల్వ శ్రీనివాసులు ఫైర్

ఇప్పటికైనా ఏ విధమైన మచ్చలేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శిలు చేయటం మానుకోవాలని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యం గురించి జగన్, ఆయన అనుచరులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ లక్ష కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని లూటీ చేసిన విషయం రాష్ట్రంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసునని తెలిపారు.
ఒక ముఖ్యమంత్రి, ఆయన కొడుకు చేసిన అవినీతి అక్రమాలవల్ల, ఐఏఎస్ అధికారలు జైళ్ళకు పోయిన విషయాన్ని ప్రజలు మరిచిపోరని కాల్వ శ్రీనివాసులు అన్నారు.












Click it and Unblock the Notifications