రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత

ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది పార్టీలు మారే నేతల సంఖ్య ఎక్కువైంది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు తమ పార్టీల నుంచి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దీనిలో భాగంగానే అధికార పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు. టికెట్లు ప్రకటించిన తరువాత కూడా పలు పార్టీల నేతలు వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టిన తరువాత పలు పార్టీలకు చెందిన నేతలు భారీగా వైసీపీలో చేరారు.

జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 221 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉండటం విశేషం. ఇక గత ఎన్నికల్లో జనసేన తరుఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు సైతం భారీగా వైసీపీలో చేరడం జరిగింది. టీడీపీ, జనసేన బలంగా ఉన్న స్థానాల నుంచే ఈ చేరికలు ఉండటం విశేషం.

kamalapuram tdp leader veera siva reddy joins ysrcp

రాయలసీమ, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. రాయలసీమకు చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. కమలాపురం టీడీపీ టికెట్ ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+