‘బురదలో పంది..’: జగన్‌కూ పేరుందని కామినేని సెటైర్లు, నవ్వేసిన చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ తనదైన శైలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. అమరావతిలో జరిగిన భూముల క్రయవిక్రయాలపై బుధవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి కామినేని మాట్లాడారు.
చర్చలో భాగంగా మాట్లాడిన మంత్రి కామినేని.. పందిని ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం సభ్యుల్లో నవ్వులు పూయించగా, విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించి నినాదాలు చేయించేలా చేశాయి.
'జగన్ విధానం ఎమ్మెల్యేలకు గౌరవం కాదు. నా వరకూ వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడికీ సొంత పేపర్ ఉండకూడదు. పేపర్ అంటే, దాన్ని చదివిన వాళ్లు నమ్మేలా ఉండాలి. సొంత పేపర్ పెట్టుకుని మనవాళ్లంతా పునీతులు ఉన్నట్టు రాసుకోకూడదు' అని అన్నారు.

'మీరు ఒక్కటి తెలుసుకోండి... జగన్‌మోహన్ రెడ్డి గారూ... దేశంలోని సీనియర్ రాజకీయ నాయకులంతా చంద్రబాబును గౌరవిస్తారు. మనం మన నాయకుడిని గౌరవించుకోలేక పోతే, అది దురదృష్టం. మీకూ ఓ పేరొచ్చింది. ఎందుకొచ్చింది.. మీరు రాజశేఖరెడ్డి కొడుకుగా కాకుండా, ఆ కేసుల్లో జైలుకు వెళ్లినప్పుడు పేరొచ్చింది' అని సెటైర్ వేశారు.
అంతేగాక, 'పచ్చకామెర్ల వాళ్లకు దేశమంతా పచ్చగా కనిపిస్తుంది. పంది బురదలో ఉండి అందరి మీదా బురద చల్లాలని అనుకుంటుంది. అది కరెక్ట్ కాదు.' అంటుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. కామినేని వ్యాఖ్యలను విన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముసిముసిగా నవ్వుకున్నారు.












Click it and Unblock the Notifications