దుర్గ గుడిలో రహస్య పూజలు: ఈవో సూర్యకుమారికి ప్రభుత్వం షాక్, బదలీ ఉత్తర్వులు
విజయవాడ: దుర్గ గుడిలో రహస్య పూజల వ్యవహారంలో ఈవో సూర్య కుమారిని బదలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం సరెండర్ చేసింది.
ప్రస్తుతం దుర్గగుడి ఇంచార్జ్ ఈవోగా దేవాదయ శాఖ కమిషనర్ అనురాధకు బాధ్యతలు అప్పగించింది. దుర్గగుడిలో పూజల వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను బదలీ చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఆమెపై వేటు పడింది.

డిసెంబర్ 26న అర్ధరాత్రి పూజలు
దుర్గ ఆలయంలో డిసెంబర్ 26న అర్ధరాత్రి బద్రీనాథ్‌తో పాటు మరో ముగ్గురు అనధికార పూజారులు పూజలు చేయడం వెనుక ఈవో సూర్య కుమారే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా చెబుతున్నారు. మహిషాసుర మర్ధిని రూపానికే పూజలు నిర్వహించేలా ఆమె నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆలయ ప్రధాన పూజారీ బద్రీనాథ్ బంధువుగా పేర్కొనే పార్థసారిథి ఇంతకుముందు దుర్గగుడి పూజల్లో పాల్గొనేవాడని చెబుతున్నా అతడు కేవలం మహిషాసుర మర్దిని అలంకారం రోజే వచ్చి పాల్గొనేవాడని చెబుతున్నారు.

అలంకారం చేసి ఫోటోలు పంపాలని
అలంకారం చేశాక ఫోటో తీసి ఫోన్లో తనకు పంపాల్సిందిగా ఈవో సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ ఫోటోను తాను ఎవరికో పంపాల్సి ఉందని చెప్పినట్లుగా పోలీసు దర్యాఫ్తులో వెల్లడైంది. ఫోటోను ఆమె ఎవరికి పంపదలుచుకున్నారు, ఈ వ్యవహారం వెనుక ఈవోతో పాటు ఇంకా వేరేవారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోను దర్యాఫ్తు చేయనున్నారు.

ఫోన్ ఎందుకు చేశారు
పూజలో ఉన్న సమయంలో పూజారులు ఈవోతో ఫోన్లో మాట్లాడిన అంశాన్ని పోలీసులు గుర్తించారు. నాలుగు నిమిషాలకు పైగా వారు ఫోన్లో మాట్లాడుకున్నారు. కేవలం వివరాలేనా, లేక ఆ సమయంలో పూజా క్రమాన్ని ఆమెకు వినిపించేందుకు ఇలా చేశారా అన్నది దర్యాఫ్తులో తేలనుందని చెబుతున్నారు.

సంప్రదాయానికి విరుద్ధంగా
ఆలయ ప్రధాన అర్చకులు బద్రీనాథ్ ఎప్పటి నుంచో తన బంధువుకు ఉద్యోగం గురించి అడుగుతున్నారని, ఈ పూజ చేయిస్తే ఉద్యోగం ఇస్తానని ఆమె చెప్పి ఉంటారని దర్యాఫ్తులో తేలినట్లుగా సమాచారం. అగంతకులు ఆలయంలోకి ప్రవేశించారని, సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయని తేలిందని పోలీసులు చెప్పారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications