కందుకూరు విషాదం: మృతదేహాలకు సాయంత్రం అంత్యక్రియలు; నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి సభలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఇక కందుకూరు చంద్రబాబు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఎనిమిది మంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు.

కందుకూరు ఘటనతో టీడీపీలో విషాదం

సభను ఆపేసి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, మృతుల కుటుంబాలను ఓదార్చి తాను అండగా ఉంటానని చెప్పారు. అంతేకాదు చనిపోయిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధితులకు పిల్లలు ఉంటే ఎన్టీఆర్ ట్రస్టు కింద చదివిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన అమాయకులు మృతి చెందడం బాధ కలిగిస్తోందని చెప్పిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కందుకూరు ఘటనతో టీడీపీలో విషాదం అలముకుంది.

తీవ్ర ఆవేదనలో టీడీపీ శ్రేణులు


ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కందుకూరు సభలో తొక్కిసలాట ఘటనపై తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా తోపులాట జరిగి పలువురు టిడిపి కార్యకర్తలు పక్కనే ఉన్న డ్రైనేజీలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటన తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదాన్ని కారణంగా మారింది. పార్టీ నేతలు ఈ దుర్ఘటనపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

కందుకూరు ఘటనపై నారా లోకేష్ స్పందన ఇదే

కందుకూరు ఘటనపై నారా లోకేష్ స్పందన ఇదే

ఇక కందుకూరు సభలో జరిగిన విషాద ఘటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చంద్రబాబు గారు నిర్వహించిన కందుకూరు సభలో చోటు చేసుకున్న అపశృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారా లోకేష్ కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్తలు మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కందుకూరు సభలో తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా నారా లోకేష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ పేర్కొన్నారు.

నేడు సాయంత్రం మృత దేహాలకు పోస్ట్ మార్టం

నేడు సాయంత్రం మృత దేహాలకు పోస్ట్ మార్టం

ఇదిలా ఉంటే ఉదయం 6 గంటలకు మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోస్టుమార్టం మొదలుపెట్టారు వైద్యులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల రోదనలతో ఏరియా వైద్యశాల ప్రాంగణమంతా మార్మోగిపోతోంది. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడం కోసం అధికారులు అంబులెన్సులు రెడీ చేశారు. ఈరోజు సాయంత్రం మృతుల దేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అంత్యక్రియలకు హారు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+