Kanipakam Temple : కాణిపాకం ఆలయానికి భారీ ఆదాయం...
Kanipakam Temple : కాణిపాకం ఆలయానికి భారీ ఆదాయం : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీ ఆదాయం చేకూరింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తిరుపతిలోని పుణ్యక్షేత్రాలతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయాలతో పాటు అనేక ఆలయాలు ఎంతో పేరుగాంచాయి. అందులో ఒకటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఈ ఆలయానికి నిత్యం భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నిత్యం ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.
ఇక, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. కాణిపాకం హుండీకి రికార్డుస్థాయి ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులే స్వయంగా ప్రకటించారు. మొత్తం రూ.1,13,03,666 ఆదాయం వచ్చినట్లు చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు వెల్లడించారు. బుధవారం నాడు కాణిపాక ఆలయ సిబ్బంది ఆస్థాన మండపంలో స్వామివారికి వచ్చిన కానుకలను లెక్కపెట్టడం జరిగింది. స్వామివారికి వచ్చిన కానుకల్లో గోల్డ్ 100గ్రాములు ఉండగా, వెండి 670గ్రాములు ఉంది. వీటితోపాటు ఇతర కరెన్సీ కూడా ఉన్నాయి. ఇందులో డెబ్బై యూఎస్‌ఏ, 210 కెనడా, 60 న్యూజిల్యాండు డాలర్లు, 20 ఇంగ్లాండు ఫౌండ్లు స్వామి వారి కానుకల్లో లభించాయి. వీటితో పాటు గో సంరక్షణ హుండీలో మొత్తం రూ.10,900 ఆదాయం సమకూరగా, ప్రచార రథం హుండీ ద్వారా రూ.5,589 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి వచ్చిన ఈ ఆదాయం మొత్తం కేవలం 19 రోజుల్లో వచ్చినది మాత్రమే అని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

46 దేశాలకు చెందిన యాత్రికులు :కాణిపాకం స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయతో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు. ఏపీలోని అత్యంత ప్రసిద్ధిచెందిన ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని ఒక్క బుధవారం నాడే 46 దేశాలకు చెందిన యాత్రికులు దర్శించుకున్నారు. ఇందులో ప్రధానంగా అమెరికా, కెనడా, యూకే, నెదర్లాండ్స్, జర్మనీ, రష్యా వంటి దేశాలకు చెందిన భక్తులు అధికంగా ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ఈ భక్తులంతా వరసిద్ధివినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. వీరంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభం దగ్గర జై వినాయక అంటూ నినాదాలు చేశారు. స్వామివారి దర్శన భాగ్యం అనంతరం ఈ విదేశీ భక్త బృందానికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications