ఆ భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి పారిపోయారు: కన్నా తీవ్ర విమర్శలు, మీడియాపైనా..
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ కుంభకోణాల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రాలు భాగస్వాములంటూ దూషించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసిపోయారని దుయ్యబట్టారు.

తెలుగువారికి ద్రోహం
శనివారం ఉదయం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు మాత్రం ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగువారికి చంద్రబాబు ద్రోహం చేశారని అన్నారు.

అప్పుడు విమర్శించి.. వారితోనే ఇప్పుడు..
రాహుల్ ఓ అజ్ఞాని అని.. సోనియాకు డబ్బుల పిచ్చి పట్టిందని.. మన్మోహన్ సోనియా చేతిలో రబ్బరు స్టాంప్ అని.. త్వరలోనే దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతుతుందని.. గతంలో కాంగ్రెస్ పార్టీని చీల్చిచండాడిన చంద్రబాబు ఈరోజు ఆ పార్టీతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఏపీ విభజన సమయంలోనూ సోనియాపై చంద్రబాబు విరుచుకుపడ్డారని, కాంగ్రెస్ పార్టీది రక్తంతో తడిసిన హస్తమని చంద్రబాబు విమర్శించారని కన్నా గుర్తు చేశారు.

ఏ స్థాయికైనా దిగజారుతారా?.. మీడియా వంతపాడటం..
చంద్రబాబు తీరుతో ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి నాయకత్వం ఏపీకి అవసరమా? అని ప్రశ్నించారు. ఈయనకు సపోర్టు చేసే మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అవినీతి అనకొండలా మారిన చంద్రబాబు ఏం చేసినా.. పలు మీడియా సంస్థలు ఆయనకు వంతపాడుతున్నాయని ఆరోపించారు. దీన్ని ప్రజలు ఆలోచించాలని అన్నారు.

ఢిల్లీకి పారిపోయి...
రాష్ట్రంలో ప్రజలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు తన అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో ఢిల్లీకి పారిపోయి రాహుల్ గాంధీని కలిశారని అన్నారు. రక్షించమని వేడుకుంటున్నారని చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా?
చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతోనే ఢిల్లీకి వెళ్లారని అన్నారు. ప్రధాని మోడీ అవినీతిపరుల భరతం పడతానని చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అందుకే అవినీతిపరులందరూ కలిసి మోడీ మళ్లీ అధికారంలోకి రావొద్దని భయంతో కూటమిగా ఏర్పడ్డారని, ఈ అవినీతి అనకొండ చంద్రబాబు కూడా ఆ కూటమిలో చేరిపోయారని విమర్శించారు. ఇలాంటి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పుకోవడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications