టీడీపీ-జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి: పొత్తుకు షరతులు పెట్టిన హరిరామ
అమరావతి: తెలుగుదేశం పార్టీ-జనసేన పొత్తుల వ్యవహారంపై కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పకపోవచ్చని మొన్నటివరకు స్పష్టం చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. ఒంటరిగా పోటీ చేసినా- జనసేన పార్టీ మెజారిటీ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన వేర్వేరుగా కలిసి పోటీ చేసినా పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. 2014-2019 నాటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవని వ్యాఖ్యానించారాయన. అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ- ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాయని, ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తోన్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటానికే పొత్తులు అవసరమౌతాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ జనసేన పార్టీ అభ్యర్థులపై పడతాయని, అగ్రవర్ణ పేదలు, వెనుకబడిన సామాజిక వర్గాల ఓటుబ్యాంకు, ముస్లింల ఓట్లు దీనికి అదనంగా జనసేకు లభిస్తాయని పేర్కొన్నారు. అన్ని స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీకి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాబోవని హరిరామజోగయ్య అన్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ అయిదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనేదే తన అభిమతమని, ప్రతి కాపు ఓటరు కూడా ఇదే కోరుకోవాలని చెప్పారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా జనసేన పార్టీనే అధికారంలోకి వస్తుందని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగితే- తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పేరును ప్రకటించాల్సి ఉంటుందని హరిరామ జోగయ్య తేల్చిచెప్పారు. కాపు సామాజిక వర్గం చేతుల్లోకి పరిపాలన రావాల్సిన అవసరం ఉందని, తమ ఎదురు చూపులు ఫలించాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు. ఈ డిమాండ్ల సాధనే ధ్యేయంగా జనసేన పార్టీకి అనుబంధంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందని అన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications