ఇండియన్ రైల్వే.. 2 ఇన్ 1 రైళ్లు

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రయాణికుల అభిరుచులు తెలుసుకుంటూ వారికి కావల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటూ తాను కూడా మార్పులకు లోనవుతోంది. సరకు రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లు నడుస్తుంటాయి. ప్రయాణికులను చేరవేయడానికి ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

కరోనా సమయంలో రైల్వేలకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. ప్రయాణికులతోపాటు సరకు రవాణాను కూడా ఏకకాలంలో నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. డబుల్ డెక్కర్ రైళ్లను తయారుచేసి అందులోని పై భాగంలో 46 మంది ప్రయాణికులు, కింద భాగంలో సరుకు రవాణా జరిగేలా యోచిస్తున్నారు. కపుర్తలాలోని ఐసీఎఫ్ లో ఈ తరహా రైలు తయారవుతోంది.

kapurthala icf will manufacture double decker trains

బెల్లీ ఫ్రైట్ కాన్సెప్ట్‌తో ఇవి నడవనున్నాయి. వీటి ట్రయల్ రన్ ఈ నెలాఖరులోపు జరగనుంది. మొదట్లో రెండు డబుల్ డెక్కర్లను రూపొందిస్తారు. ఎగువ కంపార్ట్ మెంట్ లో 46 మంది ప్రయాణికులు, దిగువ కంపార్ట్ మెంట్ లో 6 టన్నుల సరకు రవాణా ఏకకాలంలో జరుగుతుంది. మూడు డిజైన్లను రైల్వే బోర్డుకు సూచించినట్లు కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారి వెల్లడించారు.

ఈ మూడింటిలో ఒకదానికి ఆమోదముద్ర పడింది. ఒక బోగీ నిర్మాణానికి రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుంది. పూర్తి ఏసీతో ఉంటాయి. ఒక్కో రైలుకు 20 బోగీలుంటాయి. సరకులను, ప్రయాణికులను ఇవి ఏకకాలంలో తీసుకువెళ్లనున్నాయి. ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత కోచ్ లు తయారీ ప్రారంభమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+