అడ్డంగా దొరికేసిన ప్రశాంత్ కిశోర్- ఎన్నికల అంచనాలు డొల్లతనం..!!
ఎపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాల పైన అంచనాలు వెలువడుతున్నాయి. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఐ ప్యాక్ టీం తో సమావేశం సమయంలో ప్రశాంత్ కిశోర్ ఊహించని సీట్లు వస్తాయని పేర్కొన్నారు. దీనికి పీకే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల అంచనాల విషయంలో అడ్డంగా దొరికిపోయారు.
పీకే అంచనాలు
ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతుంది. వైసిపి, టిడిపి కూటమి గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు వైపు చేరారు. ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ చెబితూ వచ్చారు. ప్రశాంతి కిషోర్ వ్యాఖ్యల పైన జగన్ స్పందించారు. పీకే ఊహించని సీట్లను ఈసారి వైసిపి గెలవబోతుందని ధీమాగా చెప్పారు. మరోసారి చంద్రబాబు గెలుపు ఖాయం అంటూ చెప్పుకొచ్చారు.

గతంలో చెప్పిన జోస్యం
తాజాగా సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూకు పీకే హాజరయ్యారు. అందులో భాగంగా గతంలో పీకే చెప్పిన ఎన్నికల ఫలితాలు పై కరణ్ థాపర్ ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని, తెలంగాణలో టిఆర్ఎస్ గెలుస్తుందని గతంలో పీకే చెప్పిన అంశాలను గుర్తు చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ అసహనం వ్యక్తం చేశారు. తాను అలా చెప్పినట్టు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఎవరో రాసుకున్న దానికి కాను బాధ్యున్ని కాదని సమాధానం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు జోస్యంపై అంత ధీమాగా ఎలా చెప్పగలరని కరణ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని వదిలేసి మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే సమాధానం దాటవేశారు.
ఏపీలో ఏం జరుగుతోంది
దీంతో ఇప్పుడు ఏపీలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఎన్నికల జోష్యం పైన చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ గత మూడు నెలల కాలంగా టిడిపితో టచ్ లో ఉన్నారు. పోలింగ్ ముందు రోజు సైతం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ను కార్నర్ చేశారు. జగన్ పైన ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు. ఇక పోలింగ్ తర్వాత మరోసారి పీకే గతంలో చెప్పిన విధంగానే జగన్ ఓటమి ఖాయం అని వ్యాఖ్యానించారు. దీనిపైన వైసీపీ నేతలు సీరియస్ గా స్పందించారు. ఇక జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ జోస్యం నిజమవుతుందా.. జగన్ ధీమా నిలబడుతుందా అనేది స్పష్టం కానుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications