వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ఎమ్మెల్యే రవి ఓ నపుసంకుడు, ఆ దొంగ సొమ్ముకు చంద్రబాబు సమాధానమేంటి?"

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒక నపుంసకుడు అని బలరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10రోజుల నుంచి బలరాం పన్నుతున్న కుట్ర ఫలితమే ఇదని ఆయన ఆరోపించారు. ఈ ఘటన రవికుమారే ఉన్నారని మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగవిప్పింది. ఒకే గూటికి చెందిన నేతల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఏకంగా ఇరు వర్గాలు చంపుకునేదాకా వెళ్లడంతో.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య ఉన్న అంతర్గత కక్షలే ఈ ఫ్యాక్షన్ దాడికి కారణంగా తెలుస్తోంది.

గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య ఘర్షణ, ఇద్దరి మృతి, చంద్రబాబు సమాధానం చెప్పాలన్న కరణంగొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య ఘర్షణ, ఇద్దరి మృతి, చంద్రబాబు సమాధానం చెప్పాలన్న కరణం

దాడి అనంతరం కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒక నపుంసకుడు అని బలరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10రోజుల నుంచి రవికుమార్ చేస్తున్న చేష్టల ఫలితమే ఇదని ఆయన ఆరోపించారు. ఈ ఘటన రవికుమారే ఉన్నారని మండిపడ్డారు.

karanam balaram comments on ravikumar regarding the faction violence

ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకుని, తమపై దాడులకు పాల్పడుతున్నందుకు అధినేత చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని కరణం బలరాం డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను తీసుకొచ్చి మా నెత్తిన పెడుతున్నారని చంద్రబాబుపై కరణం ఫైర్ అయ్యారు. పార్టీలోని సీనియర్ నేతల పట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలు ఆయన తీరును జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

డబ్బు సంపాదన కోసమే రవికుమార్ టీడీపీలోకి వచ్చారని కరణం ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. మేం ఎంత సంయమనం పాటిస్తున్నా రవికుమార్ రెచ్చగొడుతూనే ఉన్నాడని తెలిపాడు. టీడీపీలో చేరి గ్రానైట్, క్వారీలకు చెల్లించాల్సిన రూ.230కోట్లు ఎగవేశాడని కరణం ఆరోపణలు చేశారు.

ఆ దొంగ సొమ్ము సంగతేంటో చంద్రబాబునాయుడే చెప్పాలని కరణం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన సంపాదన సంగతేంటో చూసుకోకుండా.. పార్టీలో సీనియర్ల పట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా? అని ఫైర్ అయ్యారు.

కాగా, శుక్రవారం రాత్రి అద్దంకి నియోజకవర్గంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వేమవరంలో వివాహానికి హాజరై వస్తున్న కరణం వర్గంపై ప్రత్యర్థులు కంట్లో కారం చల్లి దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అప్రమత్తమైన ఎస్పీ త్రివిక్రమ్.. మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ముందు జాగ్రత్త చర్యగా వేమవరం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు.

English summary
Tdp MLC Karanam Balaram alleged that MLA Ravikumar was wantedly made attacks on his group in Addanki constituency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X