పవన్‌తో కర్ణాటక మాజీ సీఎం: హోదాపై త్వరలో స్పందిస్తా (ఫోటోలు)

హైదరాబాద్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి తనకు మంచి మిత్రుడని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన పవన్ తనతో కుమారస్వామి భేటీ స్నేహపూర్వకమైనదేనని చెప్పారు.

ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పవన్ స్పష్టం చేశారు. గత 8 ఏళ్ల నుంచి కుమారస్వామితో నాకు అనుబంధం ఉందని పవన్ అన్నారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ్ సినీ ప్రవేశం గురించి చర్చించామని ఆయనఅన్నారు. కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా గురించి తాను తొందరపడి మాట్లాడబోనని అన్నారు. తనకూ ఏదో చేయాలని ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గొడవ పడాలన్నది తన అభిప్రాయం కాదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్లు కృషి చేయాలని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. ఇక రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌ పైనల్స్‌లో ఓటమి పాలై రజత పతకం సాధించిన పీవీ సింధుకు ఆయన అభినందనలు తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

అయితే కృష్ణా పుష్కరాలకు తాను వెళ్లడం లేదని పవన్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా, హోదా అంశంపై తర్వాత మాట్లాడతానని చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

ఇక పవన్‌తో భేటీపై కుమారస్వామి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడని అన్నారు.

 పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

చాలా కాలం నుంచి మా మధ్య స్నేహం ఉందని చెప్పారు. తన కుమారుడి సినిమా రిలీజ్ సందర్భంగా ఆశీర్వాదం కోసమే పవన్ కల్యాణ్‌‌ను కలిశానని కుమారస్వామి చెప్పుకొచ్చారు.

 పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

నిఖిల్‌ను పవన్‌ సొంత సోదరుడిగా భావిస్తారని ఆశిస్తున్నా అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లాంటివారని ఆయన అన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్‌ ప్రాధాన్యత ఉంటుందని కుమారస్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.

 పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

శనివారం ఉదయం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌కు బయలుదేరారు.

 పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

అనంతరం పవన్ కళ్యాణ్ ను కలిశారు. కాగా కుమారస్వామి తనయుడు నిఖిల్‌ నటించిన 'జాగ్వార్‌' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

పవన్‌ కళ్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి

కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీప్తి కథానాయికగా నటించారు. ఇటీవలే ఈ సినిమా పాటలను హైదరాబాద్‌‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+