గుండ్రేవుల ప్రాజెక్ట్ అప్పుడే వద్దు: ఏపీకి కర్నాటక లేఖ
బెంగళూరు: తుంగభద్ర నది పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన గుండ్రేవుల ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లవద్దని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానిని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్నాటక సోమవారం నాడు లేఖ రాసింది.
కర్నాటక జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామమూర్తి.. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తుంగభద్ర పైన రాజోలిబండ నీటి మళ్లింపు పథకం దిగువన కర్నూలు జిల్లా గుండ్రేవుల సమీపంలో 20 టీఎంసీల సామర్థ్యంతో డ్యాం నిర్మాణానికి ఏపీ సమాయత్తమయింది.

దీని వల్ల కర్నాటకలో ఏ మేరకు ముంపు ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందని, నీటి నిల్వ, వరద ప్రభావాన్ని కూడా పరిశీలించవలసి ఉందని చెప్పారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ప్రాజెక్టు ప్రస్తుత స్థితికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications