కార్తీకంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..!!

Karthika Masam 2024: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యాటకరంగాన్ని భారీగా ప్రోత్సహించేలా అడుగులు వేస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఈ క్రమంలో సరికొత్తగా సీప్లేన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలం వరకూ కృష్ణానదిపై ఈ సీప్లేన్‌ను నడిపించోబోతోంది. దీనికి సంబంధించిన మొట్టమొదటి ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది.

Karthika Masam 2024 APSRTC special package tour for Srisailam check details here

ఆలయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే దీనిపై పలు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పలు ప్యాకేజీలను ఏపీటీడీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి మంచి డిమాండ్ లభిస్తోంది.

ఏపీటీడీసీ బాటలో తాజాగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేస్తోన్న టెంపుల్ టికెట్స్ ప్యాకేజీ తరహాలోనే ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది.

శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సుల్లో సీట్లు రిజర్వ్ చేసుకోవడంతో పాటు దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రతీ రోజూ 1,075 దర్శనం టిక్కెట్లను దేవాదాయ మంత్రిత్వ శాఖ రిజర్వ్ చేసింది.

శ్రీశైలం వెళ్లే భక్తులు తమ దర్శనం టికెట్లను- బస్ టికెట్లతో పాటు బుక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌ సైట్‌ లేదా కండక్టర్ ద్వారా శ్రీశైలం మల్లన్న దర్శనం టికెట్లను పొందవచ్చు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ప్రతి రోజూ 200లకు పైగా బస్సు సర్వీసులను నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ.

ఈ 1,075 దర్శనం టికెట్లు కూడా స్పర్శ, శీఘ్ర దర్శనానికి సంబంధించినవి. ఇందులో స్పర్శ దర్శనం కింద 275 టికెట్లను రిజర్వ్ చేశారు. ఈ టికెట్ విలువ 500 రూపాయలు. అతి శీఘ్ర దర్శనం కింద 300 టికెట్లను కేటాయించారు. దీని ధర 300 రూపాయలు. శీఘ్ర దర్శనం 500 టిక్కెట్లను రిజర్వ్ చేశారు. ఈ టికెట్ ధర 150 రూపాయలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+