కటారి అనురాధ దంపతుల హత్య: బాత్రూంలో చేతులు కడుక్కుని ఆయుధాలు పడేసి వెళ్లారు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో నిందితులపై సాక్ష్యాలను సేకరించడం పోలీసులకు అంత సులభంగా కనిపించడం లేదని సమాచారం. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూపై కేసు నిలుస్తుందా అనేది సందేహంగానే ఉందంటూ మంగళవారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
మేయర్ దంపతులను హత్య చేసిన తర్వాత దుండగులు బాత్రూంలోకి వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లారు. దీంతో ఆయుధాలపై నిందితుల వేలి ముద్రలను పట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పక్కా ప్రణాళికతో మేయర్ దంపతులను హత్య చేసిన దుండగులు సాంకేతికపరమైన ఆధారాలు ఏవీ దొరక్కుండా చేశారని అంటున్నారు.
మేయర్ దంపతుల హత్య జరగడానికి 15 రోజుల ముందు నుంచే మున్సిపల్ కార్యాలయంలోని సిసిటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దుండగులు కార్యాలయంలోకి రావడం, హత్య చేయడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలను పట్టుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ ఏడాది అక్టోబర్‌లోనే సిసి కెమెరాల నిఘాకు ఉద్దేశించిన కంట్రోల్ కమాండ్ యూనిట్‌ను డిజిపి జెవి రాముడు ప్రారంభించారు. అయితే, ఆ యూనిట్ కూడా హత్య జరిగే నాటికి పనిచేయడం ప్రారంభించలేదు. దీంతో నగరంలో దుండగుల కదలికలను పట్టుకునే అవకాశం లేకుండా పోయింది.

హత్య ఘటనను మున్సిపల్ కార్యాలయం వెలుపలా, బయటా దాదాపు 15 మంది వరకు చూశారు. కానీ, ధైర్యం చేసి వారు కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెబుతారా అనేది అనుమానమే. దుండగుల నేర చరిత్ర కారణంగా ప్రత్యక్ష సాక్షులు ధైర్యం చేసి కోర్టు దాకా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ స్థితిలో పోలీసులు నిందితుల వాంగ్మూలాలను రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో రికార్డు చేస్తున్నారు. దానికి కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతి పొందారు.
మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులపై మారణాయుధాల కేసైనా నిలుస్తుందా అనేది కూడా సందేహంగా నే ఉంది. హత్య ఘటనలో ప్రత్యక్ష పాల్గొన్న ఐదుగురు నిందితుల నుంచి పోలీసులు ప్రత్యక్షంగా మారణాయుధాలను స్వాధీనం చేసుకోలేదు. ప్రధాన నిందితుడు చింటూ ఆయుధాలతో పట్టుబడలేదు. కోర్టులో లొంగిపోయాడు.
మేయర్ దంపతుల హత్యకు వాడిన ఆయుధాలన్నీ నిందితుల పరోక్షంలో స్వాధీనం చేసుకున్నవే. కాగా, మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడానికి ముందే చింటూ కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తన క్లయింట్‌ను ఇరికించేందుకు ఆ సమయంలో చింటూ కార్యాలయంలో ఆయుధాలు పెట్టి ఉంటారని అతని తరఫు న్యాయవాదులు వాదించే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, పోలీసులు నిందితులు ఇచ్చే వాంగ్మూలాలపైనే ప్రధానంగా ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, కోర్టుకు వచ్చే సరికి ఈ వ్యవహారం తిరగబడిన సందర్భాలున్నాయి. పోలీసులు తమను బలవంతపెట్టి, చిత్రహింసలు పెట్టి తాము చేయని నేరాన్ని తమ చేత అంగీకరింపజేశారని నిందితులు వాదించే అవకాశం ఉంది. దాంతో ఆ వాంగ్మూలాలు కోర్టులో నిలిచే అవకాశం లేదని అంటున్నారు. అయితే, పోలీసులు కేసు వీగిపోకుండా ఇతరేత్ర జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications