సమావేశాలు, చివరికీ సారీ: పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్
అమరావతి: సినీ విమర్శకులు కత్తి మహేష్ మరోసారి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయబోనని పవన్ అభిమానులతో కత్తి మహేష్ మధ్య ఇటీవల కాలంలో ఒప్పందం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కత్తి మహేష్ జనసేనపై, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు.
వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత కత్తి మహేష్ కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్‌పై కానీ, జనసేనపైనా కానీ, విమర్శలు చేయలేదు. కానీ, ఇటీవల కాలంలో తిరిగి తన విమర్శలను కొనసాగిస్తున్నారు.

ప్రత్యేకహోదాపై ఉద్యమంపై చర్చించేందుకుగాను పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 4వ తేది నుండి విజయవాడలో వామపక్షాలతో సమావేశం కానున్నారు. ఈ విషయమై కత్తి మహేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మరోసారి వామపక్షాలతో చర్చించనున్నారు.
వామపక్షాలతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 4 నుండి మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉంటారు.అయితే ఈ సమావేశాలపై కత్తి మహేష్ తన ట్విట్టర్‌లో ఇలా ట్వీట్ చేశారు.
Recommended Video

మరోసారి వామపక్షాలతో పార్టీ నాయకులు(?), కార్యకర్తలతో ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్. 4,5,6 తారీఖుల్లో విజయవాడ రానున్నారు. ఒకటోసారి! రెండోసారి!! మూడోసారి!!! మరోసారి! ఇంకోసారి!! ఆపైన.. ప్రతిసారీ!!! చివరికి సారీ సారీ అని మహేష్ ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications