సిగ్గులేకుండా! బాబు, పవన్‌లపై కత్తి వ్యంగ్యస్త్రాలు: జగన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని పలుమార్లు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం సీఎం చంద్రబాబుతోపాటు పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏం హిపోక్రసి..

‘కోస్తానుంచి ఎస్సీ, రాయలసీమ నుంచి ఓసీ అభ్యర్ధులని రాజ్యసభకు ఖరారు చేసిన చంద్రబాబు. సో.. రాజకీయాలలో, సమాజంలో కులాల గురించి దళితులు మాట్లాడితేనే అసహ్యం.అధికార కులాలు మాట్లాడితే అదొక స్ట్రాటజీ. దళితులు మాట్లాడితే కులగజ్జి. ఏం హిపోక్రసిరా భాయ్!' అని కత్తి వ్యాఖ్యానించారు.

పవన్ ఏం చేస్తారో..

‘వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడతాను అంటోంది. తెలుగుదేశం అవిశ్వాసానికి మద్దత్తు ఇవ్వము. సిగ్గులేకుండా ఎన్డీయేలో కొనసాగుతాము అంటోంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు ని ఒప్పిస్తారా లేక ఢిల్లీ గల్లీలలో మిగతా పార్టీల ఎంపీలను వెతుక్కుంటూ తిరిగి ఓపిస్తారా!?!' అని కత్తి ప్రశ్నించారు.

బాబుకు సలాం అంటూ..

‘మంత్రుల చేత రాజీనామా చేయించి, ప్రభుత్వంలో లేము అని బుకాయింపు. ఎంపిలను మాత్రం సపోర్టుగా ఉంచి, ఎన్డీఏ లో కేవలం భాగస్వాములం అని సమర్ధింపు. చంద్రబాబు...నీకు సలాం!' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చిరంజీవిపై కత్తి మహేష్ అసందర్భ ట్వీట్: నెటిజన్లు విమర్శలు

అదే చంద్రబాబు మాయ

‘తెలుగుదేశం రాజీనామాలు చేస్తే రాష్ట్రం కోసం త్యాగం. వైసీపీ చేస్తే, నాటకం. జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే, పెట్టే అర్హత లేదు. టీడిపికి అది ఆఖరి అస్త్రం. ఈ లాజిక్ అర్థమైనవాళ్ళ తల వెయ్యి ముక్కలు అవుతుంది. అదే చంద్రబాబు మాయ!' అని కత్తి మహేశ్ పేర్కొన్నారు. అంతేగాక, టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే వైజాగ్ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ బీజేపీ ప్రభుత్వం ఇమ్మిడియట్‌గా ఇస్తుందని మరో ట్వీట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Film critic Kathi Mahesh Fired at Andhra Pradesh CM Chandrababu Naidu and Janasena Chief Pawan Kalyan for state issues.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి