నాటి మీ పౌరుషం ఏమైంది: రాయలసీమ నేతలకు కవిత

Kalvakutnla Kavitha
హైదరాబాద్: రాయలసీమ నేతలకు పౌరుషం ఏమయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ప్రశ్నించారు. నిజాం కాలంలో బళ్లారి, రాయచూర్ జిల్లాలతో కలిపి బ్రిటిష్ వారికి ఇచ్చేశారని, అందుకే వాటిని దత్తత మండలాలు అని పిలిచేవారని, 1928లో ప్రత్యేకంగా సమావేశం పెట్టుకొని రాయలసీమగా పిలుచుకుందామని నిర్ణయించారని కవిత అన్నారు.

ఆ పౌరుషం ఇప్పుడు ఏమయిందన్నారు. అస్థిత్వం ఎక్కడుంది, ఎందుకు భూతల వైకుంఠం లాంటి తిరుపతిని వదులుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాదులో భూకబ్జా సంస్కృతికి తెరలేపింది రాయలసీమ నాయకులేనని ధ్వజమెత్తారు. గురువారం బందుకు తెలంగాణ జాగృతి మద్దతునిస్తుందని తెలిపారు.

పది జిల్లాల తెలంగాణే: కిషన్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటుకు బిజెపి కట్టుబడి ఉందని, హైదరాబాద్‌తో సహా 10 జిల్లాల తెలంగాణను మాత్రమే బిజెపి కోరుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. కొత్తగా రాయల తెలంగాణ తకరారను తెస్తే తాము ఎంత మాత్రం సహించేది లేదని చెప్పారు. పార్టీ రాష్టక్రార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని అన్నారు. రాయల తెలంగాణను నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు తాము బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట కార్యదర్శి నారాయణ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. రాయల ప్రతిపాదన ఎవరికోసం తీసుకువచ్చారో చెప్పాలని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+