జూడాలపై కెసిఆర్ సర్కారు సీరియస్: ఎస్మాకు సిద్ధం

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిఎంఈ ప్రకటించింది. గ్రామీణ సర్వీసుల నిబంధన విషయంలో జూనియర్ డాక్టర్లు ఇలా పట్టుపట్టడం సరైంది కాదని డిఎంఈ తెలిపింది. ఇలాగే వ్యవహరిస్తే జూడాలపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది.

చర్చలకు జూనియర్ డాక్టర్లు ముందుకు రాకపోవడం సరికాదని, గ్రామీణ సర్వీసుల నిబంధన న్యాయస్థానాల్లో ఉందని పేర్కొంది. దానిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిపింది. చట్ట ప్రకారం జూనియర్ డాక్టర్లు ఏడాదిపాటు రూరల్ సర్వీసు చేయాల్సిందేనని పేర్కొంది.

సమ్మెను ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. సమ్మెల పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం జూడాలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్మా ప్రయోగించేందుకు కూడా తాము వెనకాడబోమని తేల్చి చెప్పింది.

KCR Government warns Junior Doctors

రోగులకు ఇబ్బందులు కలగకుండా జూడాలు సానుకూలంగా స్పందించి వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ప్రస్తుతం
జూనియర్ డాక్టర్లు ఆందోళన వల్ల రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. గత కొద్ది రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

ఈఆర్సీ ఛైర్మన్‌గా ఇస్మాయిల్ ఖాన్ నియామకం

తెలంగాణ ఈఆర్సీ ఛైర్మన్‌గా ఇస్మాయిల్ అలీఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఈఆర్సీ ఎంపిక కమిటీ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇస్మాయిల్ ఖాన్‌ను ఛైర్మన్‌గా ఎంపిక చేస్తున్నట్లు సిఎం కె చంద్రశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈఆర్‌సి టెక్నికల్ సభ్యుడిగా ఎల్ మనోహర్ రెడ్డి, ఈఆర్‌సి ఆర్థిక సభ్యుడిగా శ్రీనివాసులు నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+