టి సాధించిన కెసిఆర్ గ్రేట్: అజిత్ సింగ్, రేపు 'వార్' రూం
న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందనీయులు అని రాష్ట్రీయ లోక దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షులు అజిత్ సింగ్ సోమవారం అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టడంలో భాగంగా కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం అజిత్ సింగ్‌ను కలిశారు.
అనంతరం అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణ సాకారం అవనుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నారన్నారు.

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారని కెసిఆర్ మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ బిల్లు పైన పార్లమెంటులో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ తాము అధిగమిస్తామన్నారు. ఆర్ఎల్డీ మొదటి నుండి తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. పార్లమెంటులో బిల్లు కచ్చితంగా ఆమోదం పొంది తీరుతుందన్నారు. కాగా, కెసిఆర్ మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ అంశంపై కలువనున్నారు.
వార్ రూంలో సమావేశం
మంగళవారం రాత్రి ఏడు గంటలకు వార్ రంలో సమావేశానికి రావాలని సీమాంధ్ర ప్రాంత ఎంపీలకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పిలుపు వచ్చింది. వార్ రూంలో తెలంగాణ అంశంపై మాట్లాడనున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications