అంతర్జాతీయ నగరాలుగా: కేసీఆర్ వరాలు, 500కోట్లతో..
కరీంనగర్: వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను అంతర్జాతీయ నగరాలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌కు, తెలంగాణకు వరాలు కురిపించారు.
ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాలను అంతర్జాతీయ స్థాయి నగరాలుగా మారుస్తామన్నారు. నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. మానేరు గార్డెన్‌ను బృందావనంగా మారుస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు.

రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని, ప్రజాప్రతినిధులు కూడా రైతులకు నచ్చ చెప్పాలన్నారు. మూడేళ్ల తర్వాత రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పారు. విద్యుత్ సమస్య పైన రైతులు సంయమనం పాటించాలని కోరారు. ఎస్సారెస్సీ ప్రాజెక్టులోని కాకతీయ కాలువ సామర్థ్యం 12వేల క్యూసెక్కులకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దాని కెపాసిటీ 8వేల క్యూసెక్కులు ఉంది. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా ఇచ్చేందుకు సిద్ధమని అధికారులకు తెలిపారు.
ఇంటింటికి తాగునీటి కోసం 25వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రణాళిక చేసినట్లు తెలిపారు. పాలమూరులో రూ.500 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఇందుకోసం 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తామన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ కిషన్ రెడ్డియే
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి జగత్ ప్రకాష్ అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ల భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ భవనాల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు మంగళవారం భేటీ కానున్నారు. తెలంగాణకు చెందిన స్పీకర్ మధుసూధనాచారి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వీరిద్దరు అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ గదుల కేటాయింపు విషయం... ఈనెల 16 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై వీరిద్దరు చర్చలు జరపనున్నారు.












Click it and Unblock the Notifications