స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ కీలక నిర్ణయం, నేరుగా - ఏపీ పార్టీలకు భారీ షాక్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ బిడ్డింగులో పాల్గొనేందుకు పావులు కదుపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఎత్తులను చిత్తు చేయాలని పావులు కదుపుతోంది. దీని ద్వారా ఏపీలోనూ రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించింది.

స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ మూలధనం కోసం ఇచ్చిన ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌- ఈవోఐ) బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో సింగరేణి లేదా ఖనిజాభివృద్ది సంస్థ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఒకట్రెండు రోజు ల్లో అధికారుల బృందం ఒకటి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్లి, అధ్యయనం చేయనుంది. అయితే, సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో, బిడ్డింగ్‌ నిర్ణయంలో రాష్ట్ర సర్కారు నిర్ణయమే ఫైనలా క లేక కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాల్సి ఉంది.

KCR Sensational Decision

విశాఖకు అధికారుల బృందం..: విశాఖ స్టీల్ ప్టాంట్ కు సంబంధించి ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూ ఇటీవల మంత్రి కేటీఆర్‌ లేఖ రాసారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే సన్నాహాల్లో భాగంగా ఆర్‌ఐఎన్‌ఎల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈవోఐని విడుదల చేయించిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్‌ను నేరుగా కొనుగోలు చేయాలని, ఇందుకు బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఈ క్రమంలోనే ఈవోఐలో పాల్గొనాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. దీని కోసం తెలంగాణ అధికారులు విశాఖకు రానున్నారు.

రాజకీయంగా మైలేజ్ దక్కేలా..: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనటం ద్వారా రాజకీయంగానూ మైలేజ్ సాధించేలా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. విశాఖ హక్కు..తెలుగు ప్రజల హక్కుగా ఇప్పటికే బీఆర్ఎస్ నినదిస్తోంది. ఈ బిడ్డింగ్‌ను దక్కించుకుంటే.. నైతికంగా కేంద్రంపై విజయం సాధించినట్లవుతుంది. గతంలో పీవీ, వాజపేయి ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన మూలధన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచే అందించారు. తాము బిడ్డింగ్‌లో పాల్గొంటే ఇప్పుడు కూడా కేంద్ర సర్కారు అంతిమంగా ఆ బాటలోనే పయనించక తప్పదని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇందులో ఏది జరిగినా..ఏపీలో రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ నిర్ణయం రాజకీయంగా దెబ్బ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+