Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి పై బీఆర్ఎస్ స్టాండ్ క్లియర్ : అక్కడే అసలు ట్విస్ట్..!?

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఖరారయ్యారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెలాఖరులో ఏపీలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో ఏపీలోని కీలక అంశాల పైన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది క్లారిటీ వస్తోంది. ఏపీకి చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరిక వేళ ఈ అంశాలం పైన స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అమరావతి..మూడు రాజధానులు..పోలవరం విషయంలో బీఆర్ఎస్ ఏపీ ప్రజలకు వివరించేందుకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఏ స్థాయిలో ఉంటుందనే చర్చ సమయంలో..ఈ నిర్ణయాలు రాజకీయంగా ఎవరి పైన ఎఫెక్ట్ చూపిస్తాయనేది ఆసక్తిని పెంచుతోంది.

ఏపీలో కేసీఆర్ కొత్త రాజకీయ అడుగులు

ఏపీలో కేసీఆర్ కొత్త రాజకీయ అడుగులు


ఏపీలో నేతలను ఎంచుకోవటంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న సామాజిక - రాజకీయ పరిస్థితుల్లో కాపు వర్గానికి తన పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో కాపు - బీసీ - ఎస్సీ నేతలను ఎక్కువగా తన పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ గోదావరి జిల్లాలకు చెందిన వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇదే సమయంలో ఏపీలోని అంశాల పైన పార్టీలో చేరుతున్న నేతలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పోలవరంకు సహకరిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రత్యేక హోదా అంశంలోనూ కేంద్రం పైన ఒత్తిడి పెంచే విషయంలో మద్దతుగా నిలుస్తామని చెప్పారని సమాచారం. ఇక, మూడు రాజధానుల అంశంలోనూ బీఆర్ఎస్ లో చేరుతున్న నేతలు క్లారిటీ ఇస్తున్నారు.

రాజధాని వ్యవహారం పైన నిర్ణయం తీసుకున్నారా..

రాజధాని వ్యవహారం పైన నిర్ణయం తీసుకున్నారా..


ఏపీలో రాజధాని వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిపక్ష పార్టీలు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్ స్టాండ్ ఏంటనేది ఆసక్తిగా మారింది. గతంలో అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ హాజరైన సభకు తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. నాడే అమరావతి అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. జగన్ సీఎం అయిన తరువాత అమరావతి అభివృద్ధి గురించి స్పందించారు. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో తన పార్టీలో చేరుతున్న నేతలతో కేసీఆర్ తమ వైఖరి స్పష్టం చేసారని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఏపీ రాజధాని వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరిన నేత రావెల కిషోర్ బాబు చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని బీఆర్ఎస్ లో చేరికకు ముందు వ్యాఖ్యానించారు. దీని ద్వారా బీఆర్ఎస్ అమరావతికి అనుకూలంగా ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో

సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో


ఇప్పుడు రావెల కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అమరావతి అనుకూల వైఖరితో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేసీఆర్ ఏపీ పర్యటన సమయంలో రాజధాని పైన తన అభిప్రాయం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రాజధానులకు అనుగుణంగా వైసీపీ వెళ్తున్న వేళ.. బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్న నేతలు చెబుతున్నట్లుగా అమరావతికి అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తే రాజకీయంగా చోటు చేసుకొనే సమీకరణాల పైన చర్చ సాగుతోంది. అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే టీడీపీ - జనసేన ఓట్ల పైన ప్రభావం చూపుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న అమరావతి ప్రాంత వాసుల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుందనేది మరో అంచనా. దీంతో, ఇప్పుడు రావెల చెబుతున్నట్లుగా మూడు రాజధానులకు బీఆర్ఎస్ వ్యతిరేకమా.. లేక, కేసీఆర్ అధికారిక ప్రకటన మరోలా ఉంటుందనేదే ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+