చంద్రబాబుపై నిందలా?: కేంద్రం చిన్నచూపని కెఈ మండిపాటు

కర్నూలు: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అన్నారు.

కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తామని ప్రకటించగా.. కాదు 10ఏళ్లు కావాలని డిమాండ్‌ చేసిన భారతీయ జనతా పార్టీ నేడు అదే హోదా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రెండు ఎత్తిపోతల పథకాల వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన చట్టం ప్రకారం... కొత్తగా నిర్మించే సాగునీటి పథకాలకు ఎపెక్స్‌, కేంద్ర జలసంఘం, గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతులు ఉండాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

KE Krishna Murthy fires at centre

నిందను చంద్రబాబుపై వేస్తున్నారు

తెలంగాణ అనుమతులు లేని సాగునీటి ప్రాజెక్టును కడుతూ... నిందను మాత్రం ఏపీ సీఎం చంద్రబాబుపై వేస్తున్నారని కేఈ కృష్ణమూర్తి అన్నారు. విభజన చట్టం ప్రకారం జలవనరుల శాఖ అనుమతితో డిండి, పాలమూరు ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. అలాగే నీతి ఆయోగ్‌ను అడ్డం పెట్టుకోని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం సరికాదని, ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని కేఈ పేర్కొన్నారు.

టిడిపిలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శనివారం తెదేపాలో చేరారు. నగరంలోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన నీరు- చెట్టు కార్యగోష్ఠిలో టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు భారీసంఖ్యలో కార్యకర్తలు కూడా టిడిపిలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే తాను ఆ పార్టీని వీడుతున్నట్లు ఇప్పటికే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+