కెసిఆర్‌కు రాయలసీమ తడాఖా చూపిస్తాం: కెఈ

 KE Krishna Murthy warns KCR
కర్నూలు: శ్రీశైలం నీరు, విద్యుత్‌ విషయంలో రోజుకో మాట మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు రాయలసీమ తడాఖా చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. బెదిరింపులకు భయపడేది లేదని, సీమవాసుల సహనాన్ని పరీక్షించవద్దని, త్వరలో నీ కథ తేలుస్తామని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరు మార్కెట్‌ యార్డులో బుధవారం మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రాయలసీమ సాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టులో తమ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపి వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటున్నా ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిని చేస్తూ సీమకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణలోని రైతులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తమ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని సాగిస్తున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రజా సమస్యల కోసం పాటుపడుతున్న తెలుగుదేశం ప్రజా ప్రతినిధులను సభలలో నిలదీస్తున్న సీపీఎం నాయకులకు శ్రీశైలం నీటి విషయంలో ఒక్కమాట కూడా మాట్లాడని జగన్‌ను ఎందుకు ప్రశ్నించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుపర్చేందుకు రైతు, డ్వాక్రా రుణమాఫీ కోసం మొదటి విడతగా రూ.5 వేలకోట్లు బ్యాంకులలో డిపాజిట్‌ చేశామని, త్వరలోనే రైతులకు కొత్త రుణాలను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+