జగన్ బినామీలకు తెలంగాణ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు: వైయస్‌ని లాగిన కేఈ

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి నేతలు కేఈ కృష్ణమూర్తి బుధవారం నాడు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పైన కర్నూలులో దీక్ష చేసే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు.

నికర జలాలు అవసరం లేదని బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లేఖ ఇచ్చారని, తద్వారా రాయలసీమ గొంతు కోశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తన బినామీలకు కాంట్రాక్టులు ఇప్పించుకుంటూ జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

పాలమూరు - డిండి ఎత్తిపోతలతో రాయలసీమ ఎడారి అవుతుందని చెప్పారు. ఆ ప్రాజెక్టులు ఎలాంటి అనుమతి లేదని చెప్పారు.

KE Krishnamurthy drags YS Rajasekhar Reddy into Telangana projects

హోదాను వెంకయ్య అడ్డుకుంటున్నారు: రామకృష్ణ

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రయివేటు బిల్లు పైన ఓటింగుకు రాకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకుంటు్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశాక హోదాపై సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 22వ తేదీన ఉద్యమించనున్నట్లు చెప్పారు.

మంత్రి నారాయణతో పోలీసు ఉన్నతాధికారుల భేటీ

ఏపీ పోలీసు ఉన్నతాధికారులు మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. అమరావతిలో పోలీసు ప్రధాన కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక సచివాలయంలోనూ బ్లాక్‌ కేటాయించాలని సీఆర్డీఏకు డీజీపీ రాముడు లేఖ రాశారు.

పోలీసు ప్రధాన కార్యాలయానికి 28.5లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని కోరినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆర్టీసీ కార్యాలయాలు, బస్‌భవన్‌ ఏర్పాటుకు 215 ఎకరాలు అడిగినట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివ రావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+