కేఈ నాకు చాక్లెట్లిచ్చారు, ఏమనను!: వైసీపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, డోన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర నాథ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కేఈకి తన తండ్రితో మంచి సంబంధాలు ఉండేవని, సీఎం కావాలన్న కోరికను కేఈ తన తండ్రి ముందు వెల్లడించారని రాజేంద్రనాథ్ ఓ సందర్భంలో అన్నారు.
దీనిపై కేఈ వెంటనే స్పందించారు. తనకు సీఎం కావాలన్న కోరిక లేదని చెప్పారు. అంతే కాకుండా తాను ఎవరి వద్ద కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను డిప్యూటీ సీఎంను అయ్యానని, దీంతో తన నియోజకవర్గ ప్రజలు సంతోషంతో ఉన్నారని చెప్పారు.

మరో సందర్భంలో.. రాజేంద్రనాథ్ మాటలు వినీవినీ తలనొప్పి వస్తోందని, ఆయన ప్రసంగం ఆపితే తలనొప్పి తగ్గించుకుంటామని కేఈ అన్నారు. జమీందార్ల కుటుంబం నుంచి వచ్చిన రాజేంద్రనాథ్‌కు పేద ప్రజల గురించి తెలియదని అన్నారు.
ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారీ ఎడమ చేయి పైకెత్తి అరె.. మాట్లాడు అన్నట్టు చూపుతాడని ఎద్దేవా చేశారు. దానికి రాజేంద్రనాథ్ సమాధానమిస్తూ నాకు ఉప ముఖ్యమంత్రి అంకుల్ అవుతారు. ఆయన నాకు చిన్నప్పుడు ఐస్‌క్రీములు, చాక్లెట్లు కొనిపెట్టారని, అందుకే ఆయన్ను ఏమీ అనలేనని చెప్పారు.












Click it and Unblock the Notifications