చంద్రబాబుకు బిగ్ షాక్..వైసీపీలోకి కేేఈ ఫ్యామిలీ
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాయలసీమలోని కీలక నేత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీనిని వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారాయన.ఈసారి డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో తనకు ఎక్కడైనా చోటు కల్పిస్తారని కేఈ ప్రభాకర్ ఆశలు పెట్టుకున్నారు. కేఈ ప్రభాకర్‌ను పక్కన పెట్టిన చంద్రబాబు డోన్ స్థానంలో కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పేరును ఖారారు చేశారు. పత్తికొండ సీటును సోదరుడు కేఈ కృష్ణమూర్తి కుమారుడుకు కేటాయించడంతో కేఈ ప్రభాకర్‌కు మొండిచేయి ఎదురైంది.

టికెట్ దక్కకపోవడంతో కేఈ ప్రభాకర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీని వీడాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగానే తన అనుచరులతో భేటీ అయిన కేఈ ప్రభాకర్ తన రాజకీయ భవిష్యత్తు గురించి వారితో చర్చించారు. ఈక్రమంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలతో కేఈ ప్రభాకర్ మంతనాలు జరిపినట్టు సమాచారం అందుతోంది.
ఆయన ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ సమక్షంలో కేఈ ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీలో స్పష్టమైన హామీ దక్కడంతోనే కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. కేఈ ప్రభాకర్‌ను కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్నూల్ పార్టీ అభ్యర్థిగా బీవై రామయ్యను పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు ఆయన స్థానంలో కేఈ ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేయనున్నట్టు సమాచారం అందుతోంది.
బీవై రామయ్యకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చి..అతని స్థానంలో కేఈ ప్రభాకర్‌ను కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకంటించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూల్ జిల్లాలో కేఈ ఫ్యామిలీకి మంచి పట్టుంది. కేఈ ప్రభాకర్ సోదరుడు కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు ఆయన తమ్ముడు కేఈ ప్రభాకర్ టీడీపీని వీడితే ఆ ప్రభావం కచ్చింతంగా జిల్లా మొత్తం మీద పడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications