నాకు సంబంధం లేదు: అమరావతికి ల్యాండ్ పూలింగ్‌పై కెఈ సంచలనం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూసేకరణ జరిపిన విషయంపై రాష్ట్ర రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో భూముల సేకరణతో తనకు సంబంధం లేదని, అది మరో మంత్రి చూసుకుంటున్నారని ఆయన చెప్పారు. గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారారు.

రాజధాని కోసం భూముల సేకరణపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేయడంపై ప్రశ్నించగా ఆయన ఆ విధంగా స్పందించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రశ్నించగా అది మరో మంత్రిత్వ శాఖ అంశం కాబట్టి తాను స్పందించలేనని అన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి వాస్తవమేనని, అయితే దాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కెఈ చెప్పారు.

Photos: ఘనంగా గంటా కుమారుడి వివాహ రిసెప్షన్

KE says he was not concerned about land pooling

బాక్సైట్ తవ్వకాలపై ఉద్యమిస్తాం

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను జరగనిచ్చే ప్రసక్తి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అఖిల పక్షం, గిరిజన సంఘాలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రాణాలు అడ్డు పెట్టయినా తవ్వకాలను అడ్డుకుటామని తెలిపారు.

టిడిపి నేతలను నక్సలైట్లు కిడ్నాప్ చేసినా ముఖ్యమంత్రి చెంద్రబాబుకు బుద్ధి రాలేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎలా అనుమతులు ఇస్తారని అడిగారు.

బాక్సైట్ మైనింగ్ అనుమతుల జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన పోరాటాలను, హక్కులను కాలరాస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+