ఒక్క రోజులో సీన్ మార్చేసిన బాలినేని..!!
ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత రాజకీయ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నేతల పోటీలో గెలుపు పైన భారీగా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత బాలినేనికి ఈ సారి ఒంగోలులో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. టీడీపీ నుంచి దామచర్ల జనార్ధన్ సైతం గెలుపు పైన ధీమాగా ఉన్నారు. పోలింగ్ ముందు చోటు చేసుకున్న కీలక సమీకరణాలు ఫలితాన్ని స్పష్టం చేస్తున్నాయి.
భారీ అంచనాలు
ఒంగోలులో ఫలితం పైన టీడీపీ, వైసీపీలో బారీ అంనాలు ఉన్నాయి. అక్కడ బాలినేని ఎంపీ సీటు మాగుంట కోసం చివరి వరకు పట్టు బట్టారు. ఒక దశలో వైసీపీ వీడుతారనే ప్రచారం సాగింది. చివరకు ఆయన జగన్ సూచన మేరకు ఒంగోలు నుంచి బరిలోకి దిగారు. ఎంపీగా చెవిరెడ్డి పోటీ చేసారు. ఈసారి ఒంగోలులో పోలింగ్ శాతం బాగా పెరిగింది.

వైసీపీలో నెలకొన్న పరిస్థితులతో పోలింగ్ ముందు వరకు ఒంగోలులో దామచర్లకు అనుకూలంగా వాతావరణం కనిపించింది. కానీ, ప్రత్యర్ధి బలం మీద గురి పెట్టిన బాలినేని స్కెచ్ మార్చేసారు. తన నియోజకవర్గంలో పట్టుబట్టి 25 వేల మందికి ఇంటి స్థలాలు ఇప్పించారు. ఇక, పథకాల లబ్దిదారుల మద్దతుతో గెలిచేలా ప్లాన్ చేసారు.
హోరా హోరీ సమరం
పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి పోల్ మేనేజ్ మెంట్ లోనూ టీడీపీ కంటే వైసీపీ మెరుగ్గా వ్యవహరించనే అభిప్రాయం ఉంది. ప్రతీ ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ లో పక్కాగా వ్యవహరించే జనార్ధన్ టీం ఈ సారి వెనుకబడినట్లు సమాచారం. దామచర్ల టీంలో కొందరు చివరి నిమిషంలో వైసీపీతో చేరినట్లు స్థానికంగా ప్రచారం ఉంది.
ఇక పోలింగ్ సమయంలోనూ వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజీనామా చేసిన వాలంటీర్లు పూర్తి స్థాయిలో పని చేసినట్లు స్థానిక నేతలు చెబుతుననారు. ఒంగోలు అర్బన్ లో రెండు పార్టీలు సమానంగా ఓట్లు దక్కించుకున్నా..రూరల్ మండలంలో టీడీపీకి మెజార్టీ వస్తుందనే అంచనాలు ఉననాయి. కొత్తపట్నం మండలంలో తమకు భారీ మెజార్టీ వస్తుందని వైసీపీ లెక్కలు వేస్తోంది.
అంచనాలు ఫలించేనా
పోలింగ్ సరళి తమకు పూర్తిగా అనుకూలంగా ఉందని రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎంపీ ఓటు విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఎంపీగా మాగుంటకు వేసిన వారు కొందరు ఎమ్మెల్యేగా బాలినేనికి మద్దతుగా నిలిచారనే విశ్లేషణలు ఉన్నాయి.
ఈ లెక్కలన్నీ చూసిన తరువాత బాలినేని అయిదో సారి ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. కానీ, టీడీపీ కేడర్ మాత్రం పోలింగ్ సరళి పరిశీలించిన తరువాత దామచర్లకే అనుకూల ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..జూన్ 4న వెల్లడి కానున్న తుది ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications