అయ్యప్ప భక్తుల కోసం ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయం..!!
అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు దర్శన సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజులో 16 గంటల పాటు దర్శనాలకు అనుమతించనున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో భక్తులకు సహకారం కోసం కేరళ అటవీ శాఖ భక్తులకు అత్యవసర సేవలు అందించడానికి 'అయ్యన్' పేరుతో యాప్‌ను రూపొందించింది,
భక్తుల కోసం యాప్:అయ్యప్ప భక్తుల కోసం కేరళ అటవీ శాఖ యాప్ అందుబాటులోకి తెచ్చింది. శబరిమలకు చేరుకునేందుకు భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత ఫ్లైట్‌లో వెళ్లినా కచ్చితంగా కొంత మార్గం మాత్రం అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల తిరుమల కాలి నడక మార్గంలో పులి దాడికి సంబంధించిన సంఘటనలు అందరినీ ఉలిక్కిపడేలా చేసిన నేపథ్యంలో అయ్యప్ప స్వాముల కోసం అటవీశాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. అటవీ ప్రాంతంలో భక్తులకు అత్యవసర సేవలు అందించడానికి 'అయ్యన్' పేరుతో యాప్‌ను రూపొందించారు. హెల్ప్ సెంటర్స్, హెల్త్ ఎమర్జెన్సీ, బస, ఏనుగు స్క్వాడ్, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్ట్, తాగునీటి పాయింట్లతోపాటు మరిన్ని సేవలకు సంబంధించిన సమాచారం ఈ యాప్‌ల పొందొచ్చు.

దర్శనాలపై కీలక నిర్ణయం:అలాగే అధికారులతో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ యాప్ సేవలందిస్తుంది. ఇక ఈ యాప్‌ను తెలుగుతో పాటు.. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నడక మార్గంలో వెళ్తున్న సయంలో ఏవైనా జంతువులు దాడి చేసినా, మార్గ మధ్యంలో తారసపడినా వెంటనే అధకారులకు సమాచారం అందించడంతో పాటు సహాయం పొందొచ్చని చెబుతున్నారు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్‌ను రూపొందించారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు దర్శన సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజులో 16 గంటల పాటు దర్శనాలకు అనుమతించనున్నట్టు వెల్లడించారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 3 గంటలకే ఆలయం తెరిచి సుప్రభాత సేవ, నెయ్యాభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభించి... మధ్యాహ్నం 1 గంటకు నిలిపివేస్తారు.
క్యూ కంట్రోల్ సిస్టమ్:తిరిగి 4 గంటలకు దర్శనాలను ప్రారంభించి.. రాత్రి 11 గంటలకు వరకూ అనుమతించి, హరివరాసనం అనంతరం మూసివేస్తారు. సన్నిధానంలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నిలక్కల్, పంబా వద్ద వీడియో స్క్రీన్‌లతో కూడిన డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.సాధారణంగా మాసపూజలు, ఇతర పండుగల వేళ ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి.. మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తారు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ దర్శనాలకు అనుమతిస్తారు. శబరిమల వద్ద 6 దశల్లో 13 వేల మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. ఇక వృద్ధులు, చిన్నారులకు అయ్యప్ప దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు కేటాయించారు. రద్దీని నియంత్రించేందుకు ఆలయం మూసివేసినా.. రాత్రివేళ పావన పదునెట్టాంబడి వద్ద భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. దర్శన సమయాన్ని పెంచడం వల్ల భక్తులకు దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గి ఊరట లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications