వైసీపీ మరోసారి అభాసుపాలైంది: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఆహారం తెచ్చే వాహనం పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు.

విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఆహారం తెచ్చే వాహనం పై తప్పుడు ఆరోపణలు చేశారని, వైసీపీ దొంగల ముఠా నంద్యాలలో తిష్టవేసి విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

వైసీపీ మౌత్ పీస్‌లా మారిన సాక్షి పేపర్, సాక్షి టీవీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, నంద్యాలలో వైసీపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జగన్ కుయుక్తులు నంద్యాలలో పనిచేయవని కేశినేని నాని అన్నారు.

వైసీపీ దిగజారుడు రాజకీయాలు: కొనకళ్ల

ఓటమి భయంతో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిగత వాహనంపై ఆరోపణలు చేసి అభాసు పాలయ్యారని ఎద్దేవాచేశారు. జగన్‌ది హత్యా రాజకీయాల చరిత్ర అని, జగన్‌పై 16 కేసులున్నాయని, జైలుకెళ్లడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+