వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, పేదలకు 19లక్షల ఇళ్లు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

|
Google Oneindia TeluguNews

Recommended Video

అర్హులందరికీ పక్కా ఇళ్లు, కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

అమరావతి: అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణానికి ప్రధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రూ.500 కోట్లతో ప్రైవేటు భూముల కొనుగోలు చేయనున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహరంపై అధికారుల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ వ్యవహరంపై ఏర్పాటు చేసే కమిటీతొ 15 రోజులకొకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించాలని సీఎం ఆదేశించారు.

 key decisions of andhra pradesh cabinet meet

హైకోర్టు సూచన మేరకు విజయవాడ నగరంలో ఉన్న 5 ఆస్తులను వేలం వేయలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 26.07 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనితోపాటు మరికొన్ని ప్రతిపాదనలకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు:

- అర్హులందరికీ పక్కా ఇళ్లు. ఇందుకోసం రూ.500 కోట్లతో ప్రైవేటు భూముల కొనుగోలు.
- 2019నాటికి నిర్మించి పేదలకు అందివ్వడం.
- తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ క్లస్టర్‌-2 అభివృద్ధి.
- తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వద్ద వాణిజ్య రేవు అభివృద్ధి.
- కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌కు వాణిజ్యరేవు అభివృద్ధి బాధ్యతలు అప్పగింత.
- డెంటల్‌ ఇనిస్టిట్యూట్‌ యాక్ట్‌-2007 రద్దు.
- పీపీపీ పద్ధతిలో భోగాపురం ఎయిర్‌ పోర్టు అభివృద్ధి.
- ఏపీ భవన్‌లో జాయింట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్ల నియామకం.
- ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల ట్యూషన్‌ ఫీజు పెంపు.
- 11వ వేతన సంఘానికి తాత్కాలిక ప్రాతిపదికన 16 పోస్టుల మంజూరు.
- శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలోఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి 18 ఎకరాల ప్రభుత్వ భూమిని షరతులకు లోబడి ఉచితంగా అప్పగింత.
- విజయవాడ అర్బన్ మండలం గుణదల గ్రామంలో దీపా మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు విజ్ఞప్తి మేరకు ట్రస్టుకు 0.75 సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయింపు, బకాయిల రద్దు.
- విశాఖ జిల్లా గోపాలపట్నంలో సర్వే నంబర్‌ 114లోని 500 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని ఒలింపియన్, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్, కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత ఎంవీ మాణిక్యాలుకు ప్రోత్సహకంగా కేటాయింపు.
- కడప జిల్లా వీఎన్‌ పల్లి మండలం అనిమెల, యు. రాజుపాలెం, అలిందెన, గొనుమాకులపల్లి, పిళ్లావారిపల్లి గ్రామాల పరిధిలోని 118.87 ఎకరాల ప్రభుత్వ భూమిని పవన విద్యుత్ కేంద్ర ప్రాజెక్టుకు కేటాయంపు.
- విశాఖ జిల్లా పరవాడ మండలంలో నేషనల్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సింహాద్రి ఎన్టీపీసీ థర్మల్ పవర్‌కు 883.08 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.
- పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ 2లో ఫీడర్ కెనాల్ నీటి సరఫరా సామర్థ్యాన్ని 85 క్యూమెక్స్ నుంచి 328 క్యూమెక్స్‌కు పెంచేందుకు అదనంగా ఖర్చుచేసిన రూ.3878.966 లక్షల వ్యయం మంజూరు.
- నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టులో రూ 121.23 లక్షలతో నామినేషన్ పద్ధతిపై అత్యవసరమైన 29 పనులకు చీఫ్ ఇంజనీర్ (తిరుపతి) గతంలో ఇచ్చిన పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌
- ప్రకాశం జిల్లా దర్శి లో మినీ స్టేడియం నిర్మాణానికి 6.05 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రీడా ప్రాధికార సంస్థకు ముందస్తుగా అప్పగించేందుకు కలెక్టర్‌కు అధికారాలు.

English summary
Andhra Pradesh cabinet meet held on Tuesday. key decisions were taken on this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X