తొలి ప్రపంచ కమ్మ మహాసభ - చంద్రబాబు, రేవంత్ హాజరు..!!
ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావటం..విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వటంతో పాటుగా ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేసారు.
కమ్మ మహాసభ ద్వారా
కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత...అభివృద్ధి..భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసారు. ఈ సంస్థ జెట్టి కుసుమకుమార్ నాయకత్వంలో ఏర్పాటు అయింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ కమ్మ మహాసభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఈ మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.

ఇద్దరు సీఎంల హాజరు
భారతదేశజనాభాలో 1.5శాతంగా, ప్రపంచవ్యాప్తంగా 2.1కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని వివరించారు. వీరిని ఒకే వేదికపైకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నైపుణ్యభివృద్ధి, రైతులకు ఆసరా, సభల నిర్వహణ, ఇతర సామజిక వర్గీయులకు చేయూతనందించడం, విశేష సేవలందించిన వారిని గుర్తించి వారిని సత్కరించడం వంటి లక్ష్యాలతో తమ సంస్థ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పనిచేస్తుందని కుసుమకుమార్ చెప్పారు. ఈ సభల్లో సంస్థ భవిష్యత్ లక్ష్యాలను ఖరారు చేయటంతో పాటుగా...అతిధుల సూర్పిదాయక ప్రసంగాలు ఉంటాయని చెప్పారు.
భవిష్యత్ లక్ష్యాలతో
ఈ తొలి మహాసభలో మేథోసంపద పరస్పర మార్పిడి, కమ్మ కుటుంబాల సమాచార బదిలీ, వెనుకబడిన కుటుంబాలకు ఆలంబన అందించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణ, విశిష్ట వ్యక్తుల గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్ ను తీర్చి దిద్దేలా యువతకు చేయూత, రాజకీయ సాధికారత, వ్యవసాయానికి తోడ్పాటు, పెట్టుబడులు, ఉద్యోగవకాశాల్లో పెద్దపీట వేయడం వంటివాటిపై చర్చిస్తారని జెట్టి కుసుమ కుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications