తయారుదారు కంటతడి: లడ్డూ నిమజ్జనం (పిక్చర్స్)
హైదరాబాద్: 59 అడుగుల భారీ గణనాథుడి లడ్డూ ప్రసాదం పాడవడంతో సాగర్ నీటి పాలైన విషయం తెలిసిందే. గణేషుడి ప్రసాదం కోసం భారీగా భక్తులు ఖైరతాబాద్‌కు చేరుకున్నారు. అయితే, నిపుణుల పరిశీలన అనంతరం లడ్డూ పాడయిందని తెలుసుకుని దానిని సాగర్‌లో శుక్రవారం నిమజ్జనం చేశారు.
అప్పటికే ప్రసాదం కోసం భక్తులు క్యూ కట్టారు. లడ్డూ పాడయిందని, తినేందుకు ఉపయోగపడదనే విషయం తెలుసుకున్న పలువురు భక్తులు దానిని తమకు పంచాలని పొలాల్లో చల్లుకుంటామని, ఇంట్లో పెట్టుకుంటామని చెప్పారు. చివరకు తాపేశ్వరం నుండి తెప్పించిన నాలుగువేల కిలోల లడ్డూను సాగరంలో నిమజ్జనం చేశారు.
లడ్డూ చెడిపోయిందని, దానిని సాగర్ పాలు చేసిన విషయం తెలుసుకుని దానిని తయారు చేసిన మల్లిబాబు కంటతడి పెట్టారు. లడ్డూ తడవకుండా ప్లాస్టిక్ కవర్ పెట్టారు. చివరి రోజు దానిని తొలగించారు. దీంతో వర్షానికి తడిసింది. తడిసిన పై భాగాన్ని తొలగించి కింద భాగాన్ని భక్తులకు పంచాలని సూచించినా ఆలస్యమైంది.

లడ్డూ నిమజ్జనం
59 అడుగుల భారీ ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

నీళ్లలో లడ్డూ
భారీ ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

క్రేన్ ద్వారా
ఖైరతాబాద్ గణేషుడు లడ్డూ ప్రసాదాన్ని సాగర్‌లో క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తుండగా దానిని చూసేందుకు తరలి వచ్చిన వారి దృశ్యం.

ఖైరతాబాద్ గణేష్
భారీ ఖైరతాబాద్ గణనాథుడిని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో భారీ క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం. గణేషుడి గురువారం నిమజ్జనం చేయగా, లడ్డూ ప్రసాదాన్ని శుక్రవారం నిమజ్జనం చేశారు.












Click it and Unblock the Notifications