కిడ్నీ రాకెట్ రట్టు, విద్యార్థులకు టీచర్ ప్రేమ పాఠాలు, అడిగితే..
హైదారాబాద్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను హైదరాబాద్ పోలీసులు చేధించారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు సోమవారం వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా కిడ్నీల క్రయ విక్రయాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్‌లోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
డాక్టర్లను, బ్రోకర్‌ను అరెస్టు చేశారు. ఈ ముఠా కిడ్నీ మార్పిడీ ప్యాకేజీని రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంటోంది. అందులో కిడ్నీ దాతకు రూ.5లక్షలు, ఆస్పత్రికి రూ.13 లక్షలు, వైద్యుడికి రూ.8లక్షలు, ప్రయాణపు ఖర్చులకు రూ.1 లక్ష, బ్రోకర్‌కు రూ.3లక్షలు ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ ఈ ముఠా సభ్యులు 9 కిడ్నీలను అమ్మినట్టు పోలీసులు నిర్థారించారు. కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.

విద్యార్థులకు ప్రేమ పాఠాలు
ప్రకాశం జిల్లా కొండేపిలోని ఓ పాఠశాలలో ప్రేమికుల దినోత్సవం నాడు ఓ టీచర్ 8వ తరగతి విద్యార్థులకు ప్రేమ పాఠాలు బోధించారని సమాచారం. ఈ విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు టీచర్‌ను నిలదీశారు. దీంతో ఆమె ప్రతిగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులను విచారించిన పోలీసులు.. ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు బోధిస్తున్నట్లు తేలిందని తెలుస్తోంది. అయితే, ప్రేమికుల దినోత్సవం నాడు తాను దాని గురించి చెప్పానని చెబుతోందట.












Click it and Unblock the Notifications